Monday, November 18, 2024

పరాగ్‌కు ఉద్వాసన! ట్విట్టర్‌కు కొత్త సీఈఓ..

న్యూఢిల్లి : టిట్టర్‌ కంపెనీని 44 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌.. కొత్త సీఈఓను నియమించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సీఈఓగా పని చేస్తున్న భారతీయ సంతతికి చెందిన పరాగ్‌ అగరాల్‌ను తొలగించనున్నట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితమే టిట్టర్‌ చైర్మన్‌ బ్రెట్‌ టేలర్‌తో ఎలాన్‌ మస్క్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొత్త సీఈఓ నియామకంపై చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. ప్రస్తుత యాజమాన్యంపై తనకు నమ్మకం లేదని, సరికొత్త బృందాన్ని రంగంలోకి దించే ఆలోచనలో మస్క్‌ ఉన్నట్టు సమాచారం. అయితే గత నవంబర్‌లోనే టిట్టర్‌ సీఈఓగా పరాగ్‌ అగర్వాల్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అధికారికంగా కంపెనీని పూర్తి స్థాయిలో మస్క్‌కు అప్పగించేంత వరకు పరాగే సీఈఓగా కొనసాగనున్నారు. అప్పటిలోగా కొత్త సీఈఓను వెతుక్కునే పనిలో ఎలాన్‌ మస్క్‌ ఉన్నారు.

ఏడాది పూర్తి కాకుండానే..

ఏడాది కాలానికిగాను పరాగ్‌ అగర్వాల్‌ను సీఈఓగా బాధ్యతలు అప్పగించారు. 12 నెలల్లోగా తొలగించినట్టయితే.. 42 మిలియన్‌ డాలర్లను పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై కూడా మస్క్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. బోర్డులోని ఇతర సభ్యుల పరిహారంపైనా మస్క్‌ అసహనం వ్యక్తం చేశారని ఓ అధికారి వివరించారు. అయితే మస్క్‌ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టిన తరువాత.. కచ్చితంగా పరిహారాలు, వేతనాల్లో కోతలు విధిస్తారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ట్విట్టర్‌ సీఈఓగా ఎవరిని నియమిస్తారనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

విజయ గద్దె భావోద్వేగం..

టిట్టర్‌ లీగల్‌ హెడ్‌గా భారతీయ సంతతికి చెందిన విజయ గద్దె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమెను కూడా మస్క్‌ తొలగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ విజయ గద్దెను తొలగిస్తే.. ఎలాన్‌ మస్క్‌ ఆమెకు 12.5 మిలియన్‌ డాలర్ల పరిహారంతో పాటు షేర్లను కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అత్యధిక వేతనం తీసుకుంటున్న వారిలో ఈమె కూడా ఒకరు కావడం గమనార్హం. కంపెనీకి ఎదురైన ఎన్నో న్యాయపరమైన చిక్కులను ఆమె పరిష్కరించారు. వాక్‌ సాతంత్య్రం, పోస్టుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా టిట్టర్‌పై విమర్శలు వెల్లువెత్తిన సమయంలో కూడా వాటికి పరిష్కార మార్గాన్ని చూపడంలో విజయ గద్దె కీలక పాత్ర పోషించారు. అయితే టిట్టర్‌ విక్రయం సమయంలో బోర్డు భేటీ అయినప్పుడు.. విజయ గద్దె చాలా భావోద్వేగానికి గురైనట్టు సమాచారం. ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్‌ డాలర్ల కొనుగోలు ఒప్పందం పూర్తయినప్పటి నుంచి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మస్క్‌ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టిన తరువాత తమ భవిష్యత్తు ఏంటని పరాగ్‌ను ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారమే కొనసాగింపు ఉంటుందని, ఎవరినీ అర్ధాంతరంగా తీసే ఆలోచనలో తాను లేనని స్పష్టం చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement