Monday, November 25, 2024

`దిశ’ హత్యాచార ఘటన: సల్మాన్ ఖాన్, రకుల్ ప్రీత్ సహా 38 మంది సెలబ్రిటీలపై కేసు!

రెండేళ్ల క్రితం హైదరాబాద్ శివారులోని జరిగిన `దిశ’ హత్యాచార ఘటన మరోసారి చర్చనీయాంశమైంది. ఈ కేసుకు సంబంధించి బాధితురాలి పేరు వెల్లడించడంతోపాటు ఆమె ఫొటోను షేర్ చేశారంటూ టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతోపాటు ప్రముఖ క్రీడాకారులపై ఢిల్లీలోని సబ్జీమండి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గౌరవ్ గులాటీ అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు 38 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి వారెంట్ కూడా జారీ చేశారు. అయితే, ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో న్యాయవాది నిన్న తీస్‌హజారీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

గౌరవ్ గులాటీ తన ఫిర్యాదులో బాలీవుడ్ స్టార్లు సల్మాన్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌, అజయ్‌దేవ్‌గణ్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఫర్హాన్‌ అక్తర్‌, అనుపమ్‌ఖేర్‌, అర్మాన్‌ మాలిక్‌, కరీంవీర్‌ వోహ్రా, టాలీవుడ్ ప్రముఖ నటులు రవితేజ, అల్లు శిరీష్‌, సాయి ధరమ్‌తేజ్‌, హీరోయిన్లు పరిణితి చోప్రా, దియా మిర్జా, స్వర భాస్కర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, జరీన్‌ ఖాన్‌, యామి గౌతమ్‌, రిచా చద్దా, కాజల్‌ అగర్వాల్‌, షబానా అజ్మీ, హన్సిక మోత్వాని, ప్రియా మాలిక్‌, మెహ్రీన్‌ పిర్జాదా, నిధి అగర్వాల్‌, ఛార్మీ కౌర్‌, అశిక రంగనాథ్‌, కీర్తి సురేశ్‌, దివ్యాంశ్‌ కౌశిక్‌, మోడల్‌ లావణ్య, ఫిల్మ్‌ మేకర్‌ అలంకిత శ్రీవాస్తవ, బాలీవుడ్‌ దర్శకుడు మాధుర్‌ భండార్కర్‌, గాయని సోనా మహాపాత్ర, టాలీవుడ్‌ దర్శకుడు సందీప్‌రెడ్డి, క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, శిఖర్‌ ధావన్‌, స్టార్‌ షెట్లర్‌ సైనా నెహ్వాల్‌ తదితర 38 మంది పేర్లను పేర్కొన్నారు. వీరందరిపైనా కేసులు నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి: నాలుగో టెస్టులో ఇంగ్లండ్ టార్గెట్ 368 పరుగులు

Advertisement

తాజా వార్తలు

Advertisement