Friday, November 22, 2024

TS | ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు.. తాగు,సాగు నీటి అవసరాలపై చర్చ

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగు, సాగు నీటి అవసరాలు, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో గోదావరి పరివాహక ప్రాంతం పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు నీటి పారుదల శాఖ ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక, విద్యుత్, మిషన్ భగీరథ, జల మండలి అధికారులు కూడా పాల్గొన్నారు.

గోదావరి పరిధిలోని ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు, వర్షపాతం, తాగు, సాగు నీటి అవసరాలు తదితరాలపై పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. వర్షాలు, ఎగువ నుంచి వచ్చే ప్రవాహాలు, పరిస్థితులపై కూడా చర్చించారు. ఆయా జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నీటి పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని తాగు, సాగు నీటి అవసరాలపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వర్షాభావ పరిస్థితుల్లో తాగు, సాగు నీటికి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ఇంజినీర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement