Tuesday, November 26, 2024

Big story | చరిత్ర అన్వేషణలో అద్భుతాల ఆవిష్కరణ.. సిద్ధిపేటలో ప్రాచీన చరిత్ర ఆనవాళ్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పురావస్తు పరిశోధనలు తెలంగాణ చరిత్రను సుసంపన్నం చేస్తున్నాయి. శతాబ్దాలపాటు విస్మయానికి గురైన తెలంగాణలోని చిటికెడు మట్టిలో గంపల కొలది దాగి ఉన్న చరిత్ర వెలుగులోకి వస్తోంది. అనేక ప్రాంతాల్లో సింధులోయ నాగరికథకు సమాంతరంగా అభివృద్ధి సాధించిన ఆనవాల్లు లభిస్తుండగా తెలంగాణ మారుమూల గ్రామాల్లో వేలాది సంవత్సరాల క్రితం సంఘాలు ఏర్పర్చుకుని జీవించిన తొలిమానవుల ఉనికి వెల్లడవుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో వేలాది సంవత్సరాల క్రితమే ఆదిమానవుడి నివాసాలు ఉన్నట్లు చరిత్ర కారులు ఆధారులు వెల్లడించారు.

అలాగే శాతవాహనుల నుంచి నిజాంలవరకు అనేక చారిత్రక ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కొత్త చరిత్ర అన్వేషణ బృందం చేసిన పురావస్తు పరిశోధనల్లో సిద్ధిపేటలో తొలి బాదామి చాళుక్యుల కాలం నాటి మహిషాసురమర్థిని విగ్రహాన్ని కనుకొనడంతో సిద్ధిపేట చరిత్రకు కొత్తనగిషీలు అద్దాల్సిన అవశ్యకత ఏర్పాడింది. సిద్ధి పేట జిల్లా దుద్దెడ మండలం అరెపల్లి వెంకటేశ్వరాలయం దగ్గర జరిపిన పరిశోధనల్లో ప్రాచీన అరుదైన మహిశషాసుర మర్దిని శిలావిగ్రహం వెలుగు చూసింది. .

- Advertisement -

సిద్ధిపేట జిల్లాకు చెందిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్‌, మహ్మద్‌ నసిీర్‌ ఇచ్చిన సమాచారం మేరకు కొత్త తెలంగాణ చరిత్ర బృదం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌, కో కన్వీనర్‌ వేముగంటి మురళీకృష్ణ , చరిత్రకారుడు ఈమని శివనాగిరెడ్డి ఈ విగ్రహాన్ని పరిశీలించి తొలి చాళుక్య కాలం నాటి 7వ శతాబ్దానికి చెందిన విగ్రహంగా నిర్ధారించారు. ఈ విగ్రహం 18 సెం.మీ. పొడవు, 10 సెం.మీ. వెడల్పు, 2సెం.మీ. మందం కలిగిన ఈ శిలాఫలకంలోని కింది భాగంలో మహిషాసుర మర్దిని ఎడమ చేత్తో దున్న పోతు ఆకారంలో వున్న మహిషాసురుని తోకపట్టుకుని కుడిచేత్తో శూలంతో రాక్షసుడి శరీరంలో గుచ్చుతున్నట్లుందని రామోజు హరగోపాల్‌ తెలిపారు.

అలాగే గతంలో విష్ణుకుండిన కాలంనాటి క్రీ.శ. 5వ శతాబ్దంనాటి మమహిషాసుర మర్ధిని శిల్పం కీసర గుట్టలో లభించినట్లు తెలిపారు. పానుగల్లు లో అదే కాలానికి చెందిన మహిషాసురమర్ధిని చిన్న శిలా ఫలకం లభించిందన్నారు. అయితే ఆరెపల్లిలో లభించిన ఈశిల్పం బాదామీ లోని శిల్పంకంటే ముందు దని, తెలంగాణకు చెందిన బాదామీ చాళుక్యుల కాలానికి చెందిన తొలి మహిషాసుర మర్దిని విగ్రహమని చరిత్ర కారులు భావిస్తున్నారు. అలాగే పెద్దపరిమాణంలో అమ్మవారి శిల్పాలు

అలంపురరంలో లభించాయి. ప్రస్తుతం లభించిన వెంకటేశ్వరాలయం ముందర 9వ శతాబ్దం నాటి రాష్ట్ర కూటుల శైలి జైన చౌముకిని చరిత్రను కూడా కొత్త తెలంగాణ పరిశోధన బృందం కనుకుంది. పురావస్తు.చారిత్రక ప్రాధాన్యత కలిగిన తొలి చాళుక్య ప్రతిమాలక్షణం, శిల్పకళా శైలికి అద్దంపడుతున్న ఈ శిలాఫలకాన్ని భద్రపర్చి,భవిష్యత్‌ తరాలకు అందించాలని చరిత్ర కారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో రాష్ట్ర చరిత్ర, సంస్కృతిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు ఆంధ్రుల చరిత్రనే తెలంగాణ చరిత్రగా అభివర్ణించిన సందర్భాల నుంచి తెలంగాణకు అత్యంత ప్రాచీన చరిత్ర ఉందనీ, అనేక రాజవంశాలు తెలంగాణ భూభాగాన్ని వేదికగా చేసుకు రాజ్యమేలారని చరిత్ర కారులు నిరూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ చరిత్రను సమగ్రమైన అధ్యయనంచేసి పునర్‌ లిఖించాల్సిన అవసరం ఉందని తెలంగాణ చరిత్ర కారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సింధూలోయకు సామాంతరంగా ప్రాచీన నాగరికత అభివృద్ధి చెందిన తెలంగాణలో విస్తృతంగా చరిత్ర అధ్యయనం చేసే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. వెలుగు చూడని చరిత్రను భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన అవశ్యకత కూడా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement