వందేళ్ల క్రితమే అంతరించిన ఈ రకం జాతి
గత ఏడాది హఠాత్తుగా న్యూజీల్యాండ్‌లో ప్రత్యక్ష్యం
పరిశోధనలు చేసి నిజాలు వెల్లడించిన సైంటిస్టులు
ఆడ, మగ లక్షణాలన్నీ ఈ పక్షి సొంతం
కొలంబియాలో గుర్తించిన జంతు శాస్త్రవేత్త హమీష్
జన్యుపరమైన లోపాలే కారణమని వెల్లడి
ఆంధ్రప్రభ స్మార్ట్, స్పెషల్ డెస్క్: పక్షుల్లో కూడా ట్రాన్స్‌జెండర్లు ఉంటాయనేది మీకు తెలుసా? ఈ విషయాన్ని ఇంతకుముందెప్పుడైనా విన్నారా? అయితే.. ఇది నిజమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇవి పూర్తిగా మగ లేదా పూర్తిగా ఆడవి కావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలా కీటకాల్లో ఇలాంటి ప్రత్యేకతలను గుర్తించినప్పటికీ, పక్షుల విషయంలో ఇది చాలా అరుదుగా ఉందని చెబుతున్నారు. అయితే.. శాస్త్రవేత్తలు పూర్తిగా మగ కాని ఆడ కాని పక్షిని కనుగొన్నారు. ఆడ, మగ వంటి రెండు గుణాలు ఈ పక్షిలో కనిపించినట్టు చెప్పారు. అర్ధ నారీశ్వర రూపంలో సగం మగ, సగం ఆడగా పిలిచే ఈ పక్షి విశిష్ట పక్షిగా గుర్తింపు పొంది.
అరుదైన రకపు పక్షి..
ప్రపంచంలోకెల్లా అరుదైన, వింత జీవి ఈ పక్షి. ఇది పూర్తిగా మగ, పూర్తిగా ఆడ కాదు. రెండు గుణాలు దీనిలో కనిపిస్తాయి. ఇలాంటి జీవులను ‘gynandromorph’ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. రెండు లింగాల గుణాలు దీనిలో ఉన్నట్టు పరిశోధనల్లో గమనించారు. శాస్త్రవేత్తలు ఈ ప్రత్యేకత కలిగిన అనేక కీటకాలను కనుగొన్నప్పటికీ, పక్షుల్లో ఇలాంటిది గుర్తించటం చాలా అరుదు. వంద సంవత్సరాల క్రితం ఒక పక్షి ఉండేది. అది అంతరించిపోయిందని అంతా భావించారు. కానీ, గతేడాది క్రితం ఇలాంటి పక్షి మళ్లీ కనిపించింది. న్యూజిలాండ్ శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్, కొలంబియాలో ఇలాంటి అరుదైన పక్షిని గుర్తించారు.
అంతరించిపోయిన జాతి, మళ్లీ వెలుగులోకి..
సగం ఆకుపచ్చ, సగం నీలం రంగులతో ఈ పక్షి ఉంటుంది. వంద సంవత్సరాల క్రితం అంతరించిపోయిందని భావించిన ఇలాంటి పక్షి మళ్లీ కనిపించడంతో జంతు శాస్త్రవేత్తల్లో ఉత్సాహం కనిపించింది. ఈ పక్షికి ఆడ, మగ రెండు పునరుత్పత్తి అంగాలు ఉన్నాయని చెప్పారు.. జన్యుపరమైన లోపాలే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు.