సంస్కారంతో మర్యాదగా మాట్లాడటం గొప్ప వ్యక్తిత్వం. సమాజంలో మంచి జీవితాన్ని గడపటానికి ఈ వ్యక్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు సంస్కారవంతులని, మర్యాదస్తులని గుర్తించాలని ఆరాట పడుతున్నారా? అందుకు తగిన బహు మానం ఆశిస్తున్నారా? అయితే, అలాంటి వారి కోసమే యూకేలో ఒక కాఫీ కేఫ్ ఎదురు చూస్తోంది. కేఫ్ సిబ్బందితో మర్యాదగా మాట్లాడే కస్టమర్‌కు చాయ్ రేటులో డిస్కౌంట్ లభిస్తుంది. పైగా ఎంత ఎక్కువ మర్యాదగా మాట్లాడితే, ఆ కేఫ్‌లోని చాయ్‌పై కస్టమర్లకు అంత ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కేఫ్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉంది. లాంక్ షైర్‌లో ఇటీవలే చాయ్ స్టాప్ కేఫ్ ప్రారంభమైంది. ఇక్కడికి వచ్చిన కస్టమర్లు, ఆర్డర్ చేసేటప్పుడు హలో, ప్లీజ్ వంటి పదాలను ఉపయోగిస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఆ చాయ్ స్టాప్‌లో దేసీ చాయ్ అని అడిగితే 5 పౌండ్లు చెల్లించాలి. దేసీ చాయ్ ప్లీజ్ అని అడిగితే 3 పౌండ్లు, హలో దేసీ చాయ్ ప్లీజ్ 1.90 పౌండ్లు చెల్లిస్తే చాలని కేఫ్ యజమాని ఉస్మాన్ హుస్సేన్ ప్రకటించారు. అమెరికన్ కేఫ్‌లో పొలైట్ నెస్ రూల్ ప్రభావంతో మార్చిలో స్పెషల్ మెనూ ప్రవేశపెట్టినట్లు హుస్సేన్ వెల్లడించారు. చాయ్ స్టాప్ మెనూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement