Wednesday, November 20, 2024

ద‌ర్శ‌కుడు టి.రాజేంద‌ర్ వైద్యం కోసం – విదేశాల‌కి త‌ర‌లించ‌నున్న ఫ్యామిలీ

ఇప్ప‌టి వారికి పెద్ద‌గా ఆయ‌న తెలియ‌క‌పోవ‌చ్చు..కానీ అప్ప‌ట్లో అంటే 1983లో విడుదలైన ‘ప్రేమసాగరం’ చిత్రం తెలుగునాట రికార్డులు సృష్టించింది. విజయవాడలో రెండు సంవత్సరాలు ఆడింది. ఆ సినిమాతోనే టి.రాజేంద‌ర్ పరిచయమయ్యారు. టి. రాజేందర్‌ సాంగ్‌ అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. ‘నామం పెట్టు నామం పెట్టు కాలేజికే, చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజికే…’ పాట ఎంతో హిట్టో తెలిసిందే. చక్కనైన ఓ చిరుగాలి…ఒక్కమాట వినిపోవాలి..’ ఈ పాటను తెలుగు ప్రజలు ఆల్‌టైం హిట్‌ చేశారు.ప్రేమసాగరం నుంచి టి.రాజేందర్‌ సినిమాలు అంటే హిట్‌. ఆయన సినిమాలో పాటలు బాగుంటాయి. సాహిత్యం బాగుంటుంది. పాట పాడుకునేలా ఉంటుంది. దాసరి నారాయణరావుగారికి ఆయన ఏకలవ్య శిష్యుడని చెప్తూంటారు.‘ప్రేమసాగరం’ సినిమా ఫంక్షన్‌ విజయవాడలో చేసినప్పుడు టి.రాజేందర్‌ గొప్ప డైరెక్టర్‌ అవుతారని ఆయన అన్నారు. అలాగే ఆయ‌న ద‌ర్శ‌కుడిగానే కాక మ‌ల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్నారు. కాగా టి.రాజేందర్‌. ప్రముఖ దర్శకుడు, నటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత కూడా.. టి.రాజేందర్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారు. దాంతో ఆయనను చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు ట్రీట్‌మెంట్ జరుగుతున్నది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని సన్నిహితులు మీడియాకు వెల్లడించారు.తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు… మెరుగైన చికిత్స కోసం ఆయనను విదేశాలకు తీసుకెళ్లాలనే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. రాజేందర్‌ను సింగపూర్‌కు తీసుకెళ్లి అత్యాధునిక చికిత్స అందించాలని హీరో, రాజేందర్ తనయుడు శింబు ప్లాన్ చేస్తున్నార‌ట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement