ఏ ముహూర్తాన ఆది పురుష్ సినిమాని మొదలుపెట్టారో కానీ ఎప్పుడూ పలు వివాదాల్లో నడుస్తూనే ఉంది ఈ చిత్రం. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ మూవీ. స్టార్ హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. కాగా ముంబైలో ఆదిపురుష్ చిత్ర దర్శకుడు, నిర్మాతలపై కేసు నమోదైంది.హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్, నిర్మాతలపై ఆయన సెక్షన్ 295 ఏ, 298, 500, 34 కింద కేసు నమోదు చేశారు. ముంబై హైకోర్టు న్యాయవాదులు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా సహాయంతో సంజయ్ దినానాథ్ ఈ కేసు నమోదు చేశారు. ప్రముఖ హిందూ ప్రవచన కర్త సంజయ్ దినానాథ్ తివారి ఆదిపురుష్ చిత్రంపై ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేశారు.
వరుస వివాదాలు, విమర్శలతో అసలే ఆదిపురుష్ టీం పరిస్థితి మూలిగే నక్కలా మారింది. తాజా కేసు దానిపై తాటి పండు పడ్డట్లు ఐంది. శ్రీరామ నవమికి రిలీజ్ చేసిన పోస్టర్ లో ప్రభాస్ శ్రీరాముడి లుక్ హిందూ మనోభావాలకు విరుద్ధంగా ఉందని సంజయ్ దినానాథ్ అంటున్నారు. ఆయన నమోదు చేసిన కంప్లైంట్ ప్రకారం.. రామచరిత మానస్ లో రాముడి ఆహార్యం, స్వభావానికి విరుద్ధంగా ఆదిపురుష్ లుక్ ఉందని సంజయ్ తెలిపారు. హిందూ సనాతన ధర్మం రామచరిత మానస్ కి అనుగుణంగా ఉంటుంది. కారణ జన్ముడు అయిన శ్రీరాముడి కాస్ట్యూమ్స్ అభ్యంతరకరంగా సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉంది. రామచరిత మానస్ లో వర్ణించిన విధంగా అతి ముఖ్యమైన జంధ్యం లేదని ప్రవచన కర్త సంజయ్ ఆరోపించారు.