అవతార్2లో 10నిమిషాల యాక్షన్ సీన్ ని కట్ చేసినట్లు దర్శకుడు జేమ్స్ కామెరాన్ చెప్పారు.ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు కామెరాన్ స్వయంగా వెల్లడించారు.సినిమా నిడివి తగ్గింపుపై కామెరాన్ మాట్లాడుతూ.. ‘‘నిజానికి 10 నిమిషాల పాటు తుపాకుల కాల్పులతో కూడిన యాక్షన్ సన్నివేశాలను కత్తిరించాను. వెలుగు, చీకటి మధ్య బ్యాలన్స్ లో భాగంగా అసహ్యంగా అనిపిస్తున్న వాటిని తొలగించాలని అనిపించింది. మీలో మీరు సంఘర్షణ పడాలి.
మీరు ఎలా చూస్తున్నారనే దాని ఆధారంగా హింస, యాక్షన్ ఒకే విధంగా ఉంటాయి. యాక్షన్ సినిమా రూపొందించే ప్రతీ కళాకారుడికి దీనిపైనే డైలమా ఉంటుంది. కానీ, నేను యాక్షన్ చిత్రాలు తీసే వాడిగానే అందరికీ తెలుసు అంటూ దృశ్యాల తొలగింపు వెనుక మానసిక సంఘర్షణను కామెరాన్ వివరించారు. అవతార్ -2 సినిమా విడుదలైన 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డు నమోదు చేయడం తెలిసిందే. అయితే, కనీసం రెండు బిలియన్ డాలర్లు వసూలైతేనే లాభాలు చూడగలమని కామెరాన్ పేర్కొనడం గమనార్హం.