న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో గత రబీ సీజన్ దిగుబడి నుంచి అదనంగా మరో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ సేకరించేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఆదేశాలు జారీ చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు అంగీకరించిన మొత్తం 2.6 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్‌కు అదనంగా మరో 2.5 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాల్సిందిగా తాను గత నెల 28న కేంద్ర మంత్రికి లేఖ రాసినట్టు కిషన్ రెడ్డి ఓ ప్రటనలో పేర్కొన్నారు.
ఆ లేఖపై స్పందిస్తూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ మొత్తం 5.10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ తీసుకోవాల్సిందిగా ఎఫ్‌సీఐకి ఆదేశాలిచ్చారని, తన లేఖపై వేగంగా స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కిషన్ రెడ్డి వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..