Tuesday, November 12, 2024

రాజ‌మౌళి సినిమాల‌పై.. ట్వీట్ చేసిన ఆనంద్ మ‌హీంద్రా

బాహుబ‌లితో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి ఎన‌లేని పేరు వ‌చ్చింది. కాగా ఆర్ ఆర్ ఆర్ తో ఏకంగా ఆస్కారే వ‌చ్చింది. రాజ‌మౌళి చిత్రాల‌కి ఎన‌లేని ఫ్యాన్స్ ఉన్నారు. కాగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి సినిమాపై ట్వీట్ చేశారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా..కాగా ఆయ‌న ట్వీట్ కి రాజమౌళి రిప్లై ఇవ్వడం ఆసక్తి కరంగా మారింది. ఆనంద్ మహీంద్రా సింధు నాగరికతను చూపించే హరప్పా, మొహంజొదారోకు సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేశారు. ఇవి మన చరిత్రను ఇంకా సజీవంగా చూపించి, వాటి గురించి మాట్లాడే పిక్చర్స్.. . మన ప్రాచీన నాగరికత గురించి చెప్తూ ఒక మంచి సినిమా తీసి ప్రపంచానికి చెప్పాలని రాజమౌళి గారిని కోరుతున్నాను అని మహేంద్ర ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ కి రాజమౌళి వెంటనే స్పందించారు. రాజమౌళి స్పందిస్తూ.. అవును సర్, గుజరాత్ లోని హరప్పా నాగరికత ఉన్న ఓ ఊరు ఉంది. అది ధోలావీర. అక్కడ మగధీర షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చాలా పురాతనమైన చెట్టుని చూశాను. అది శిలాజంగా మారిపోయి ఉంది. అప్పుడే ఈ చెట్టు ద్వారా సింధు నాగరికత ఎదుగుదల, పతనం గురించి చెప్పేలా ఒక సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత దాని కోసం రీసెర్చ్ చేస్తూ.. నేను కొన్నాళ్ళకు పాకిస్తాన్ కి వెళ్ళాను. ఆ కథ కోసం మొహంజొదారో దగ్గరకు వెళ్లాలని చాలా ప్రయత్నించాను. కానీ నాకు పాకిస్థాన్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అని ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ కాన్వర్జేషన్ వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement