Tuesday, November 26, 2024

నవాజ్‌ షరీఫ్‌కు దౌత్య పాస్‌పోర్ట్‌

ప్రవాసంలో ఉంటున్న పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ దౌత్య పాస్‌పోర్టును పాక్‌ ప్రభుత్వం పునరుద్దరించింది. దీంతో షరీఫ్‌ స్వదేశానికి రావడానికి మార్గం సుగమమైంది. పలు అవినీతి కేసులను ఎదుర్కొంటున్న నవాజ్‌ 2019 నుంచి లండన్‌లోనే ఉంటున్నారు. ఆయన దౌత్య పాస్‌పోర్టు గడువు ఎప్పుడో తీరిపోయినా ఇంత వరకు పునరుద్ధరించలేదు. గత ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు పాక్‌ ప్రధానిగా ఆయన సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ ప్రభుత్వం నవాజ్‌కు ఐదేళ్ల కాల పరిమితితో దౌత్య పాస్‌పోర్టును జారీ చేసింది. దీంతో నవాజ్‌ షరీఫ్‌ పాకిస్థాన్‌ వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement