Friday, November 22, 2024

T20 World Cup కామెంటరీ ప్యానెల్‌లో దినేశ్ కార్తీక్.. మెత్తం 40 మందిలో లిస్ట్ రిలీజ్

ICC టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభానికి ఇంకా ఎక్కువ సమయం లేదు. ఈ మెగా టోర్నీ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు అమెరికా, వెస్టిండీస్‌లో ప్రపంచకప్ జరగనుండగా.. ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) కూడా టీ20 ప్రపంచకప్ కోసం పూర్తి సన్నాహాల్లో బిజీగా ఉంది. కాగా తాజాగా, ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన‌ కామెంటరీ ప్యానెల్‌ను ప్రకటించింది.

భారత్‌ నుంచి దినేష్ కార్తీక్‌తో పాటు భారత మాజీ దిగ్గజ ఆటగాళ్లు హర్ష్ భోగ్లే, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్‌లకు కూడా వ్యాఖ్యాత ప్యానెల్‌లో చోటు దక్కింది. పాకిస్థాన్ దిగ్గజాలు వసీం అక్రమ్, వకార్ యూనిస్, రమీజ్ రాజా కూడా ప్రపంచ కప్‌లో వ్యాఖ్యాన ప్యానెల్‌లో భాగం కానున్నారు. అలాగే అమెరికన్ వ్యాఖ్యాత జేమ్స్ ఓ’బ్రియన్ కూడా ప్యానెల్‌లో చోటు ద‌క్కింది.

టీ20 ప్రపంచకప్‌కు కామెంటరీ ప్యానెల్:

భారత్ :
దినేష్ కార్తీక్, హర్ష్ భోగ్లే, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్.

పాకిస్థాన్ :
వకార్ యూనిస్, వసీం అక్రమ్, రమీజ్ రాజా.

- Advertisement -

న్యూజిలాండ్ :
డానీ మారిసన్, సైమన్ డౌల్, ఇయాన్ స్మిత్, కేటీ మార్టిన్.

వెస్టిండీస్ :
ఇయాన్ బిషప్శా, మ్యూల్ బద్రీ, కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ గంగా.

దక్షిణాఫ్రికా :
షాన్ పొలాక్, గ్రేమ్ స్మిత్, డేల్ స్టెయిన్, నటాలీ జెర్మనోస్, కాస్ నాయుడు.

ఆస్ట్రేలియా :
రికీ పాంటింగ్, స్టీవెన్ స్మిత్, లీసా స్థలేకర్, ఆరోన్ ఫించ్, మాథ్యూ హేడెన్, మైక్ హెస్మాన్, టామ్ మూడీ.

ఇంగ్లండ్ :
నాజర్ హుస్సేన్, అలాన్ విల్కిన్స్, ఇయాన్ వార్డ్, మైక్ అథర్టన్, ఇయాన్ మోర్గాన్, అలిసన్ మిచెల్, ఎబోనీ రెయిన్‌ఫోర్డ్-బ్రెంట్.

బంగ్లాదేశ్ – అథర్ అలీ ఖాన్.
శ్రీలంక – రస్సెల్ ఆర్నాల్డ్.
అమెరికా – జేమ్స్ ఓబ్రెయిన్
జింబాబ్వే – పోమ్మీ మ్బాంగ్వా.
నెదర్లాండ్స్ – బ్రియాన్ ముర్గాట్రాయిడ్.
ఐర్లాండ్ – నియాల్ ఓ’బ్రియన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement