వికారాబాద్ టౌన్, (ప్రభ న్యూస్): అనంతగిరి పర్యాటక కేంద్రానికి ప్రతిశని ఆదివారాలలో వేలాది మంది పర్యాటకులు వస్తున్నప్పటికి శిథిలావస్థకు చేరుకున్న పురాతన కట్టడాలను ఇటు అధికార యంత్రాంగం కాని, అటవి శాఖాధికారులు గాని రక్షించలేక పోతున్నారు. అనంతగిరిని పర్యాటకం గా అభివృద్ది చేస్తామన్న మాటను పక్కన పెడితే ఉన్న అనంతగిరిని రక్షిస్తే చాలన్న మాటలు వినిపిస్తున్నాయి. 2008లో అప్పటి మంత్రి సబితా రెడ్డి జంగిల్ పార్కు తదితర వాటికి హంగు ఆర్భాటాలతో శంఖుస్తాపన చేయగా కేవలం హామిలు తప్న ఇప్పటి వరకు చేసింది శూన్యం.
ఇటీవల తెలంగాణా పర్యాటక శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ అనంతగిరిలో 5 కోట్లతో టూరిజంగా అభివృద్ది చేస్తామని హామి ఇచ్చి 5 అడుగులు కూడా ముందుకు సాగలేదు. అనంతగిరిలో వైర్ రూప్ ద్వారా పారాషూట్ కోసం ఎమ్మెల్యే ఆనంద్ ట్రయల్ రన్ చేపిన ముందుకు సాగలేదు. ప్రజా ప్రతినిధులు చరిత్రను పురాతన కట్టడాలను కాపాడాలని అనటం తప్ప ఆచరణలో మాత్రం సాధ్యం కావటం లేదు. అనంతగిరిలో కొన్ని చారిత్రాత్మక కట్టడాలు కూలిపోయే దశలో ఉన్న అధికార యంత్రాంగం చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి అనంతగిరి అందాలను కాపాడి వన్నే తెచ్చే చరిత్రను కాపాడాల్సిన అవసరం ఎం తైనా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.