Friday, November 22, 2024

పాక్‌పై డిజిటల్‌ స్ట్రయిక్‌.. 35 యూట్యూబ్‌ ఛానెల్స్‌ బ్లాక్‌..

దాయాది పాకిస్తాన్‌కు భారత్‌ డిజిటల్‌ స్ట్రైక్‌తో బుద్ధి చెప్పింది. తమ జోలికి వస్తే.. తగిన రీతిలో బుద్ధి చెబుతామని చెప్పుకొచ్చింది. భారతదేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రత్యక్షంగా హెచ్చరించింది. సమాచార, బ్రాడ్‌ కాస్టింగ్‌ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పాకిస్తాన్‌కు చెందిన పలు యూట్యూబ్‌ ఛానెల్స్‌పై కోరడా ఝుళిపించింది. పాకిస్తాన్‌కు చెందిన 35 యూట్యూబ్‌ ఛానెల్స్‌, 2 టిట్టర్‌ అకౌంట్లు, 2 ఇన్‌స్టాగ్రాం ఖాతాలను సంబంధిత మంత్రిత శాఖ ఆదేశాలతో బ్లాక్‌ చేయించింది. ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ బ్రాండ్‌ కాస్టింగ్‌ కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడుతూ.. భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ వార్తలు ప్రసారం చేస్తున్నాయని తెలిపారు. రెచ్చగొట్టే ధోరణిలో ట్విట్టర్‌, ఇన్‌స్టాలో పోస్టులు వస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ.. భారత్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నాయని వివరించారు.

చట్టం ప్రకారమే చర్యలు..
ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం వీటిపై చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. బిపిన్‌ రావత్‌ మృతికి.. భారత్‌ ప్రభుత్వమే కారణమంటూ వార్తలు ప్రసారం చేస్తున్నాయని తెలిపారు. బిపిన్‌ రావత్‌ కూతురు ముస్లింలోకి వస్తున్నారని.. ఉత్తర కొరియా సైనికులు.. కాశ్మీర్‌కు వస్తున్నారనే పుకార్లు పాకిస్తాన్‌ ఛానెల్స్‌ పుట్టిస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి వీడియోలకు 130 కోట్ల వ్యూస్‌ వచ్చాయని, భారత దేశ జనాభాతో ఇది సమానం అన్నారు. ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు ఛానెల్స్‌కు సంబంధించిన వారి సమాచారం సేకరిస్తున్నామన్నారు. మున్ముందు ఇలాంటి మరిన్ని ఛానెల్స్‌ను మూసివేయిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా యూట్యూబ్‌ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అబద్దపు వార్తలకు అడ్డుకట్ట వేసే బాధ్యత యూట్యూబ్‌పై కూడా ఉందన్నారు. ఇలాంటి ఛానెల్స్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. అసత్య వార్తలు ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతేడాది కూడా పాకిస్తాన్‌కు చెందిన 20 యూట్యూబ్‌ ఛానెల్స్‌, 2 వెబ్‌సైట్‌లను బ్లాక్‌ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement