Friday, November 22, 2024

డిజిటల్‌ భారత్‌, రోజుకు 20వేల కోట్ల లావాదేవీలు.. గ్రామాల్లోనూ డిజిటల్‌ సేవలు

డిజిటల్‌ ఎకానమీతో దేశంలో ఒక సంస్కృతి పుట్టుకొస్తోందని, చిన్న చిన్న స్ట్రీట్‌ కార్నర్‌ షాపుల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ రావడంతో ఎక్కువ మంది కస్టమర్లకు సేవలు అందించడం సులభమైందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. దేశంలో నిత్యం రూ.20వేల కోట్ల విలువైన డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి నిర్వహించే మన్‌ కీ బాత్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. దేశమంతా డిజిటల్‌ వైపు పరుగులు పెడుతున్నదని తెలిపారు. ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ నిలబడిందని చెప్పుకొచ్చారు. దీని కారణం డిజిటల్‌ లావాదేవీలే అని, దేశంలో ప్రతీ రోజు డిజిటల్‌ లావాదేవీల సంఖ్య పెరుగుతూ ఉందని తెలిపారు. చిన్న చిన్న ఆన్‌లైన్‌ చెల్లింపులే పెద్ద డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో తోడ్పాటు అందిస్తున్నదని అభిప్రాయపడ్డారు. డిజిటల్‌ పేమెంట్స్‌ క్రమంలో ఎన్నో కొత్త కొత్త ఫిన్‌టెక్‌ స్టార్టప్‌లు వస్తున్నాయని అన్నారు.

తగ్గిన నగదు విత్‌ డ్రా..

దేశ వ్యాప్తంగా ప్రతీ రోజు వేల కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నాయని మోడీ తెలిపారు. ఒక్క మార్చిలోనే యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) లావాదేవీలు రూ.10లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించారు. గత కొన్ని సంవత్సరాలుగా.. భీమ్‌ యూపీఐ మన ఆర్థిక వ్యవస్థ అలవాట్లలో వేగంగా ఒక భాగమైందన్నారు. ఇప్పుడు చిన్న పట్టణాల్లోనూ.. చాలా గ్రామాల్లోనూ.. ప్రజలకు యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. టెక్నాలజీ శక్తి సామాన్య మానవుడి జీవితాన్ని ఎలా మారుస్తుందో అది మనం చుట్టూ ప్రతీ రోజు చూస్తున్నామని చెప్పారు. దేశంలో ఓపెన్‌ మనీ సమస్య కూడా లేదని తెలిపారు. ఇంటి నుంచి ఒక్క రూపాయి కూడా నగదు తీసుకురాకుండా.. రోజంతా ఎక్కడికైనా తిరిగే అవకాశం లభించిందని, గతంలో బయటికి వెళ్తున్నామంటే పర్సుతో వచ్చేవారని, ఇప్పుడు ఫోన్‌ పట్టుకునే వస్తే.. ప్రపంచాన్నే చుట్టేయవచ్చు అన్నారు. ఈ రోజు డిజిటల్‌ చెల్లింపుల వల్లే ఇవన్నీ సాధ్యం అవుతున్నాయని తెలిపారు. దీని కారణంగా నగదు విత్‌ డ్రా చేయాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు.

స్టార్టప్‌ కంపెనీలకు ప్రోత్సాహం..

కొత్తగా వస్తున్న స్టార్టప్‌ కంపెనీలు.. సౌకర్యాలను మెరుగుపర్చడమే కాకుండా.. నిజాయితీగల వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నదని మోడీ అభిప్రాయపడ్డారు. డిజిటల్‌ చెల్లింపుల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలోపేతమైందని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. స్టార్టప్‌కు సంబంధించిన సొంత అనుభవాలను కూడా ఇతరులతో పంచుకోవాలని సూచించారు. ఇలా పంచుకోవడంతోనే.. దేశంలో ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని తెలిపారు. దేశానికి కొత్త మ్యూజియం అందుబాటులోకి వచ్చిందని వివరించారు. పీఎం మ్యూజియం నుంచి ప్రధాన మంత్రులకు సంబంధించిన ఆసక్తికర సమాచారం పొందుపర్చడం జరిగిందని తెలిపారు. దీంతో చరిత్రపై ప్రజల్లో ఆసక్తి పెరిగిందని, ప్రధానమంత్రి చేసిన కృషిని స్మరించుకోవడంతో పాటు దేశంలోని యువతను ఆయనతో అనుసంధానం చేయడం గర్వించదగిన విషయం అన్నారు. మ్యూజియాలకు ప్రజలు అనేక వస్తువులను విరాళంగా ఇస్తున్నారని, భారతదేశ సంస్కృతిక వారసత్వాన్ని జోడించారని మోడీ తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మ్యూజియంలో డిజిటలైజేషన్‌పై దృష్టి పెట్టారని, రాబోయే సెలవుల్లో యువత తప్పనిసరిగా తమ స్నేహితులతో మ్యూజియంను సందర్శించాలని ప్రధాని సూచించారు.

- Advertisement -

మ్యూజియాల్లో డిజిటలైజేషన్‌..

మే నెలలో వచ్చే పండుగల సందర్భంలో ప్రజలు తప్పకుండా కొవిడ్‌ నియమాలు పాటించాలని సూచించారు. వికలాంగులకు వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి దేశం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని మోడీ అన్నారు. దివ్యాంగుల కళాకారుల కృషిని ప్రపంచానికి తీసుకెళ్లేందుకు వినూత్నమైన ప్రారంభం కూడా జరిగిందని, దేశం ముందుకు సాగుతున్న సంకల్పాలలో అమృత్‌ ఉత్సవం స్వాతంత్య్రం ఉత్సవం ఒకటి ప్రధాని అన్నారు. టెక్నాలజీ మరో గొప్ప పని చేసిందన్నారు. వికలాంగులైన మన సహచరుల అసాధారణ సామర్థ్యాలను దేశానికి, ప్రపంచానికి ఉపయోగించుకోవడం ఈ పని. టోక్యో ఒలింపిక్‌లో మన వికలాంగ సోదరులు, సోదరీమణులు ఏమి చేయగలరో చూశామన్నారు. మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుకుంటామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement