Tuesday, November 26, 2024

నూతన సచివాలయంలో… కమాండ్ కంట్రోల్ తో డిజిటల్ పాలన

రాష్ట్ర పరిపాలన ఇక కొత్త పుంతలు తొక్కనుంది.నూతన సచివాలయంతోపాటే నూతన విధానంలో స్మార్ట్ పరిపాలన
అందుబాటులోకి తెచ్చేలా సర్కార్ వ్యూహం ఖరారు చేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు స్మార్ట్ విధానంలో పాలన దిశగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి శ్రీకారం చుడుతోంది. పోలీస్ కమాండ్ కట్రోల్ రూమ్ తరహాలో నూతన సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలసింది. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు జరిగే పరిణామాలనుతెలుసుకోవడంతోపాటు, గ్రామస్థాయి వరకు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, వాటి అమలు తీరు పర్యవేక్షించేలా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆధునీకరించనున్నారు. గ్రామస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన మొదలుకొని రాష్ట్రస్థాయి వరకు సమాచారం క్షణాల్లో
అందుబాటులో ఉండేలా స్మార్ట్ గా దీనిని రూపొందిం చనున్నారు. ఇందులో భాగంగా డిజిటల్ మానిటరింగ్ విధానంలో జిల్లాలు, కలెక్టరేట్లు, జిల్లా స్థాయిలో ఇతర అధికారుల కార్యాలయాలను అనుసంధా నించనున్నారు. ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్
మానిటరింగ్ సిస్టమ్ పేరుతో నూతన పరిపాలనా
విధానానికి సాంకేతికను అందుబాటులోకి తెచ్చే
అంశం పరిశీలిస్తున్నారు. స్మార్ట్ పాలనలో భాగంగా కంప్యూటర్లు, ట్యాబ్లు , డిజిటల్ కీలు అన్ని ఏర్పాటు చేయనున్నారు.
క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు శాశ్వత ఫోన్లు,
సిమ్ కార్డులు, కంప్యూటర్లు అందించనున్నారు. సీఎస్
నుంచి ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు కమిష
నర్లు, కలెక్టర్లు, జిల్లా అధికారుల వరకు ఒకే నెట్ వర్క్ లో ఉండేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలు శాఖల్లో ప్రయోగాత్మకంగా కాగితపు రహిత పాలన రాష్ట్రమంతటా అందుబాటులోకి తెచ్చారు. స్మార్ట్ పాలన అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో పరిపాలన అంతా డిజిటల్ రూపంలో ముఖ్యమంత్రి
ఎదుట క్షణాల్లో సాక్షాత్కారం కానున్నది. నూతన సచివాలయం అందుబాటులోకి వచ్చిన వెంటనే తెలంగాణ అధికారిక పాలన అంతా ఎలక్ట్రానిక్ డిజిటల్ విధానంలో కొనసాగనుంది. తద్వారా రాష్ట్రంలో ఏ మూలన ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా కమాండ్
కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షించేలా సాంకేతిక
అందుబాటులోకి రానున్నది. క్లిష్ట సమయాల్లో ప్రభుత్వ పాలనకు ఇబ్బంది లేకుండా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేకుండా సత్వర పరిపాలన, ఉద్యోగుల రక్షణ, పారదర్శకత లక్ష్యంగా ఈ తరహా పరిపాలన వీలు
కల్పించనుంది. ఇప్పటికే ఆన్లైన్ ఫైలింగ్, ఫైల్స్ సర్య్కులేషన్,
వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి వాటిపై శిక్షణ పూర్తి చేశారు. కంప్యూటర్ స్క్రీన్ పై ఫైల్స్ చూస్తూ వీడియో కాలింగ్ లేదంటే ఇంటరకంలో అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు వీలుగా చర్యలు తీసుకున్నారు. ఈ పరిపాలనలో భాగంగా జిల్లాల్లో కూడా
పౌరుల పిటీషన్లను స్కాన్ చేసి ఆయా శాఖలకు పంపించనున్నారు. కలెక్టరేట్లు, మండల, డివిజన్, ఇతర కార్యాలయాల్లో ఈ తరహా పాలన కొనసాగనుంది. తహశీల్దార్, ఎంపీడీవో, ఆ తర్వాత ఆర్డీవో,
డీపీవో, లేదంటే జెడ్పీసీఈవోలకు అటుపై ఈ ఫైల్ పలు విభాగాల ద్వారా ఆన్లైన్ లో కలెక్టర్ కు చేరనున్నాయి. నేరుగా కలెక్టర్లకు వచ్చిన ఫైల్ను ఇనివార్డులలో స్కాన్ చేసి ఆన్లైన్లో సంబంధిత సెక్షన్ అధికారికి డిస్పర్స్ చేస్తారు. ఆఫీస్ సూపరింటెండెంట్ పరిశీ
లించి పైలను పుటప్ చేసి, అదనపు కలెక్టర్, కలెక్టర్లకు
చేరుతుంది.

సచివాలయంలోనైతే ఐదంచెల విధానంలో భాగంగా తొలుత ఇన్ వార్డ్ నుంచి రికార్డ్ అసిస్టెంట్ ద్వారా స్కాన్ అవుతాయి. ఆ తర్వాత సదరు ఫైలు నంబరింగ్ ఇచ్చి ప్రత్యేకంగా సంబంధిత శాఖ
సర్యులేషన్ అధికారికి ఆన్లైన్లో పంపిస్తారు. అక్కడి నుంచి అసిస్టెంట్ సెక్షన్ అధికారికి, సెక్షన్ అధికారికి చేరుతుంది. ఆ సబ్జెక్టును చూసేఅసిస్టెంట్ సెక్షన్ అధికారి పచివాలయ మాన్యువల్ ప్రకారం పరిశీలించి నోట్ ఫైల్ రాసి తిరిగి సెక్షన్ అధికారికి ఆన్లైన్లో
పంపగానే అక్కడ పూర్తి పరిశీలనతో సవ్యంగా ఉందని నిర్ధారించుకున్నాక అసిస్టెంట్ సెక్రటరీకి పంపిస్తారు. మార్పులు అవసరమైతే ఆన్లైన్లో వివరాలు మార్పులు చేస్తారు. అసిస్టెంట్ సెక్రటరీ ఫైలు పరిశీలించాక డిప్యూటీ సెక్రటరీకి ఆన్లైన్లో ఫార్వార్డ్
చేస్తారు. అదనపు కార్యదర్శి, ఆ తర్వాత ఆ శాఖ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శికి ఫైల్ చేరి అప్రూవ్అయితే జీవో విడుదల అవుతుంది. ఇదంతా ఆన్లైన్లో నే జరుగుతుంది. ఈ ఫైలును ఎక్కడి నుంచైనా
ట్రాక్ చేసి అదెక్కడ ఉందో కనుక్కోవచ్చు. జాప్యమైతే
ఇందుకు కారకులపై చర్యలు కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం ముఖ్యమైన ఫైళ్ల భద్రతపై ఆదుర్దా చెందుతోంది. ఇకపై ఫైళ్లలోని సమాచారం బైటికి వెళ్లేందుకు అవకాశం పెద్దగా ఉండదు.
ఔట్‌సోర్సింగ్, ఇతర ఉద్యోగుల వద్దకు ఫైళ్లు వెళ్లడం
నిల్చిపోతుంది. శాఖల వారీగా ఫైళ్లు నిర్దిష్ట సమ
యంలో ఎక్కడ ఉన్నాయో, వాటి ప్రస్తుత స్థితి,జవాబుదారీతనం అంతా శాఖల అసిస్టెంట్ సెక్రట రీలదే కానుంది. ఈ విధానంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలనుకమాండ్ కంట్రోల్ ద్వారా డిజిటల్ రూపంలో కేంద్రీకృతం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీఎం అధి
కారిక నివాసమైన ప్రగతి భవన్‌తోపాటు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సిస్టం ద్వారా అన్ని జిల్లాలు, కార్యాలయాల్లో డిజిటల్ కాన్ప రెన్సింగ్
సౌకర్యాలను కల్పిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ సౌలభ్యాన్ని మరింత ఆధునీ కరించే కసరత్తు జరుగుతోంది. వీడియో కాలింగ్ సౌకర్యానికి శాటిలైట్ నెట్ వర్క్ వినియోగంతో పాటు, దస్త్రాల్ట్రాకింగ్ సిస్టంను కూడా ఆధునీకరించాలని సర్కార్ నిర్ణయించింది ప్రతి ఫైల్‌ను బార్ కోడింగ్ చేసి దాని
స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించడం ద్వారా
పెండింగ్ లను నివారించి పారదర్శకత పెంచే
చర్యలను చేపడుతోంది. ఇక ప్రభుత్వ సమాచారం, శాఖల్లోని కీలక అంశాలను ఎప్పటికప్పుడు సమా చారం అప్డేట్ చేసేలా సాంకేతికను వినియోగంలోకి తేనుంది. ఈ మేరకు ఆయా సమాచారంతో కూడిన
విషయాలతో డాష్ బోర్డును ప్రారంభించాలని సీఎస్
నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సమాచార సేకరణ
సులువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లా కలెక్టరేట్లలో డీడీఆర్ సీ సమావేశాలు, ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్ల తీరుతెన్నులను నేరుగా ప్రభుత్వం వీక్షించనుంది. నీటి ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతి, విపత్తుల సమయంలో సర్కార్ ఆదేశాలు,సహాయ చర్యల పరిశీలన, ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణ అంతా వీడియో రూపంలో నేరుగా వీక్షించే వెసులుబాటు అందుబాటులోకి తేనున్నారు. దీంతో పాలనలో జాప్యం, నిర్లక్ష్యం తొలగనుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆన్లైన్ వ్యవస్థపై గతంలోనే గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వానికి ప్రజెంటేషన్ శాఖల వారీగా పాస్వర్ణతోపాటు ప్రత్యేక యూజర్ ఐడీని రూపొందిస్తే సమాచారం సురక్షితంగా ఉంటుందన్న వివిధ శాఖల అభిప్రాయం మేరకు ప్రత్యేక పాస్వర్డ్లను రూపొందిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement