సీనియర్ నటి ప్రగతిని మళ్లీ పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. పెళ్లి అని కాదు కానీ కంపానియన్ ఉంటే బాగుండేది అని చాలాసార్లు అనుకున్నా.. అయినా నా మెచూరిటీ లెవల్ కు తగ్గవాడు దొరకడం కష్టమే.. కానీ.. రావాలని ఉంటే మాత్రం అదే జరుగుతుంది అని నేను నమ్ముతాను. నాకంటూ కొన్ని విషయాల్లో చాలా గట్టిగా ఉంటాను. వాటిని తట్టుకునే వాడు ఉంటే చాలు. నేను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏమి జరిగినా కొద్దిగా అడ్జెస్ట్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు నెవెర్ అంటూ హాట్ కామెంట్స్ చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన నటి ప్రగతి ప్రస్తుతం కారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో బిజీగా వున్న సంగతి తెలిసిందే.వయసు పెరుగుతున్న కొద్దీ , తన గ్లామర్ ను పెంచు కుంటు అందరిని అలరిస్తోంది. తాను మాస్ బీట్ పాటలకు వేసే డాన్స్ ..అలాగే తాను జిమ్ లో చేసే వర్కౌట్ వీడియోస్ సోషల్ మీడియాలో లో హల్చల్ చేస్తుంటాయి.
గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన మాజీ భర్త గురించి విషయాలను తెలియచేసింది. అప్పట్లో తాను 20 సంవత్సరాల వయస్సులో వున్నప్పుడే నాకు ప్రపోజ్ చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. అతని ద్వారా బాబును కూడా కనడం జరిగిందని తెలిపింది. కొన్ని రోజులు బాగానే గడిచి పొయాయి.ఆ తర్వాత నాకు అసలు కష్టాలు స్టార్ట్ అయ్యాయని, నా భర్త ఏ సంపాదన లేకుండా వుండే వాడని, అసలు కుటుంబం గురించి పట్టించు కోలేదని చెప్పింది. దానితో నేను హీరోయిన్ గా కూడ బెట్టుకున్న డబ్బ. దానితో కుటుంబం గడవక ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడాకుల తీసుకోవడం జరిగిందని చెప్పింది.