Friday, November 22, 2024

డిఫ‌రెంట్ వెద‌ర్‌.. ఉద‌యం నుంచి ఎండ‌, సాయంత్రం అయితే వాన‌

ప్రభన్యూస్‌ : రోహిణీ కార్తె ప్రారంభమైంది. దీంతో ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణీ కార్తెలో రోళ్లు పగిలిపోతాయనే సామెత కూడా ఉంది. ఈ కార్తెలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. కానీ గ‌త రోండు మూడు రోజుల నుంచి మాత్రం దానికి భిన్నంగా జ‌రుగుతుంది. సాయంత్రం మూడుగంటల వరకు ఎండ దంచికొడుతుంది. ఎండను చూసి బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. తీవ్రంగా ఉన్న ఎండ ఒక్కసారిగా తగ్గిపోయే సరికి ఎండకు ఇబ్బందిపడ్డ ప్రజలకు వాతావరణం చల్లగా మారడంతో ఎండ‌నుంచి ఉపశమనం పొందుతున్నారు.

సాయంత్రం కాగానే వాతావరణం చల్లబడ‌టం శివారు ప్రాంతాల్లో చిరు జ‌ల్లులు కుర‌వ‌డం చల్లులు పడ్డాయి. వానాకాలం ప్రారంభమయ్యేందుకు మరో వారం రోజుల సమయం ఉంది. ఈసారి వేసవి కాలంలో మధ్యమధ్యలో వర్షాలు కురిసాయి. గతసారి మాదిరిగానే ఈసారి కూడా ఆశించినమేర వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement