Wednesday, November 20, 2024

ఇప్పుడు డీజిల్ వంతు.. తెలంగాణలో సెంచరీ కొట్టిన డీజిల్ ధర

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెంపుపై ప్రతిపక్షాలు, ప్రజలు ఎన్ని నిరసనలు వ్యక్తం చేసినా ధరల పెరుగుదలకు బ్రేక్ అయితే పడటం లేదు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ప్ర‌తిరోజూ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ‌లో లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.100 మార్క్ దాటేసింది. అదిలాబాద్‌లో అత్య‌ధికంగా లీట‌ర్ డీజిల్ రూ.100.18కి చేరింది. ఇప్ప‌టికే పెట్రోల్ రేటు రూ.100 దాటి చాలా రోజుల‌య్యింది.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ నగరంలో పెట్రోల్ ధ‌ర రూ.105.83 ఉండగా, డీజిల్ ధ‌ర రూ.97.96గా పలుకుతోంది. అదిలాబాద్‌కు ర‌వాణా ఛార్జీలు అధికంగా ఉండ‌టంతోనే అక్క‌డ డీజిల్ ధ‌ర ఎక్కువ‌గా ఉంద‌ని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వార్త కూడా చదవండి: వివాదంలో డైరీ మిల్క్ చాక్లెట్

Advertisement

తాజా వార్తలు

Advertisement