Tuesday, November 19, 2024

డీజిల్ దందా : క‌ర్ణాట‌క TO తెలంగాణ‌… 30 వేల లీటర్ల పట్టివేత

జహీరాబాద్ : ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 30 వేల లీట‌ర్ల డీజిల్ ను అక్ర‌మంగా ప‌క్క రాష్ట్రాల నుంచి తెలంగాణ‌కు తీసుకొచ్చి సొమ్ముచేసుకుంటున్నారు. అక్క‌డ త‌క్కువ ధ‌ర‌ల‌కు కొనుగోలు చేసి తెలంగాణ‌లో అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు. జహీరాబాద్‌ సబ్‌ డివిజన్‌ చిరాక్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కర్ణాటక నుంచి తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తున్న 30 వేల లీటర్ల అక్రమ డీజిల్‌ ను చిరాక్‌ పల్లి పోలీసులు ప‌ట్టుకున్న‌ట్లు ఎస్సై కాశీనాథ్‌ యాదవ్ తెలిపారు. నమ్మదగిన సమచారం మేర‌కు సివిల్ స‌ప్లై, విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ అధికారుల‌తో కలసి చీరగ్‌ పల్లీ గ్రామంలో తనిఖీ నిర్వహిస్తుండగా రెండు ట్యాంకర్‌ లలో ఒక‌దాంట్లో 24వేల లీటర్లు డీజీల్‌, మ‌రో ట్యాంక‌ర్ లో ఆరు వేల లీటర్లు డీజీల్ ను పోలీసులు గుర్తించారు. అక్రమంగా కర్ణాటక రాష్ట్రంలో తక్కువ ధరకు డీజిల్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు తెలంగాణ‌లో అమ్ముదామని తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఆర్థిక నష్టాన్ని కలగచేస్తున్నందుకు ఆయనేనీ యాదగిరి, పటాల శేఖ‌ర్‌, వీరారెడ్డి, సాయిరాం తేజ, సాయిరాం, సూర్య, హుసేన్‌ కుమార్‌ ల పై కేసు నమోదు చేసి దర్యాపు చేప‌ట్టిన‌ట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement