ఎండ్రకాయ అంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. నైంటీస్ (1990)లో చదివిన వారికి వాటితో పరిచయం ఉంటుంది. చిన్నప్పుడు పొలాల గట్ల వెంట తిరిగి.. చిన్న చిన్న కట్టెపుల్లలు, గడ్డి పోచలతో బొరియల్లో కెలుకుతూ వాటిని బయటికి రప్పించి ఆడుకునే వాళ్లు..
అయితే.. కొన్ని రకాల ఎండ్రకాయల (లోబోస్టర్) జీవన విధానం కాస్త డిఫరెంట్‌గానే ఉంటుంది. అన్ని జీవుల మాదిరిగా కాకుండా ఒక్క లొబొస్టర్ (ఎండ్రకాయ) మెదడు మాత్రం దాని గొంతులో ఉంటుంది. నాడీ వ్యవస్థ పొత్తికడుపులో.. పళ్లు కడుపులో ఉంటాయి. మూత్రపిండాలు అయితే ఏకంగా తలలోనే ఉంటాయి. ఈ జీవి తన కాళ్లను ఉపయోగించి శబ్ధం వింటుంది. పాదాలతో రుచిని చూస్తుంది. అలాగే ముందుకి ఉండే అవయవాలు పంజా మాదిరిగా పని చేస్తాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily