ప్రిన్సెన్ డయానా ఎంతో ఇష్టపడి, కొనుక్కోవడంతో పాటు మూడేళ్ల పాటు స్వయంగా డ్రైవింగ్ చేసిన ఒకే ఒక్క బ్లాక్ కలర్ బ్లాక్ ఫోర్డ్ ఎస్సార్ట్ ఆర్‌ఎస్ టర్బో 1మోడల్ కారును వేలం వేయగా, రికార్డు స్థాయిలో రూ. రూ. 6,09,38,283 కోట్లు రేటు పలికింది. ప్రిన్సెస్ డయానా 25వ జయంతి సమీపిస్తున్న తరుణంలో డయానాకు అత్యంత ఇష్టమైన బ్లాక్ ఫోర్డ్ ఎస్కార్ట్ రిజిస్ట్రేషన్ నెంబరు సి 462ఎఫ్‌హెచ్‌కె కారును వేలం వేయడం జరిగింది. సిల్వర్ స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌లో ఈ వారంతంలో వేలం నిర్వహించగా,డయానా కారు రికార్డు రేటు రూ. 6,09,38,283 కోట్లు పలికింది. ఈ కారును డయానా స్వయంగా 1885 ఆగస్ట్ 23 నుంచి 1988, మే 1వ తేదీ వరకు డ్రైవింగ్ చేశారు.
బ్లాక్‌లో ఉన్న ఒకే ఒక్క మోడల్ ఈ కారు కావడం విశేషం. సిల్వర్‌స్టోన్ వెబ్‌సైట్ కథనం ప్రకారం ఈ కారు డయానా ఆఖరి ఫోర్డ్ ఎస్కార్ట్. ఈ కారులో 24,961 మైళ్లను చూపిస్తోంది. ఈ కారులో తరచుగా డయానా ప్రయాణించేవారు. కారును స్వయంగా నడుపుకుంటూ చెల్సియా, కెన్సింగ్‌టన్‌లకు వెళ్లేవారు. 6,800ల మైళ్ల తర్వాత తిరిగి వచ్చేవారు. అయితే, వేలంలో కారును సొంతం చేసుకున్న వ్యక్తి పేరును వెబ్‌సైట్ వెల్లడించలేదు. ఆర్‌ఎస్ టర్బో ఆర్‌ఎస్ 1సిరీస్‌లో మొదట ఈ మోడల్‌ను తెలుపు రంగులో తయారు చేయడం జరిగింది. అయితే, రాయల్ ఫ్యామిలీ పోలీసు గార్డు డయాకు బ్లాక్ పెయింట్ వేసి ఇవ్వాలని కోరారు. దీంతో, ఈ కారును బ్లాక్ కలర్‌లో రూపొందించడం జరిగిందని ప్రకటించారు. ఈ కారులో డయానా చెల్సియా. కెన్సింగ్‌టన్ లోని బొటిక్ షాపుల ముందు కూడా నిలబడ్డారని ఈ కారును హిస్టరీ పీస్‌గా నిర్వాహకులు పేర్కొన్నారు.,. గత పన్నెండు సంవత్సరాల్లో అత్యధికంగా, డయానా కారు వేలానికి అత్యధిక సంఖ్యలో బిడ్లు వచ్చాయని వేలం నిర్వాహకులు జోనథన్ హంబర్ట్ వెల్లడించారు.