Saturday, November 23, 2024

మధుమేహం మందుతో కరోనాకు చెక్

కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్న అవకాశాలపై అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో మరో కొత్త విషయం వెలుగుచూసింది. మధుమేహంతో బాధపడుతున్న రోగులు వేసుకునే మెట్‌ఫార్మిన్‌తో కరోనాకు అడ్డుకట్ట వేయొచ్చొని శాస్త్రవేత్తలు తేల్చారు. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించేందుకు ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు.

ఇక కరోనా వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్‌ప్లమేషన్ పెరుగుతుంది. ఫలితంగా మరణం సంభవిస్తుంది. అయితే ఈ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో మెట్‌ఫార్మిన్ చక్కగా పనిచేస్తున్నట్టు తేలింది. ఇది కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇప్పుడీ ఔషధానికి ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా తగ్గించే సామర్థ్యం ఉందని తేలింది. ఆక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్‌డీఎస్) అనే ప్రాణాంతక సమస్య ఉన్న ఎలుకలపై చేసిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement