MS ధోని.. క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఇష్టైన ప్లేయర్.. క్రికెట్ లో తన కామ్ అండ్ కూల్ నెస్ తో కెప్టెన్ కూల్ అనే బిరుదుని సోంతం చేసుకున్నాడు. ఫీల్డ్‌లో పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, అతను తన ఎమోషన్స్ ని బయట పెట్టకుండా.. స్పాట్ డెసిషన్స్ తో టీమ్ గెలుపు వైపు అడుగులు వేసేలా చేస్తాడు. అందుకే ప్రత్యర్థి జట్లలోని సభ్యులు కూడా ధోనీని ఎంతగానో అభిమానిస్తారు. ఒక గుణాన్ని చూసి ముగ్ధులయ్యారు. వారు గ్రహించాలనుకుంటున్నారని రికార్డుల్లోకి ఎక్కారు.
అయితే.. ధోనీ కెప్టెన్సీలో ఇండియా, CSK టీమ్ లలో ఆడిన హర్భజన్ సింగ్.. ధోనీకి సంబంధించి, ఎవరికీ తెలియని ఓ స్టోరీని షేర్ చేసుకున్నాడు. ఎప్పుడూ కూల్ గా ఉండే ధోని కూడా భావోద్వేగానికి లోనై ఏడ్చేసిన అరుదైన సందర్భం గురించి మాట్లాడాడు. IPL బెట్టింగ్ కుంభకోణంలో రెండేళ్ల సస్పెన్షన్ తర్వాత ఫ్రాంచైజీ తిరిగి వస్తున్నప్పుడు 2018లో ఈ సంఘటన జరిగిందని వెల్లడించాడు హర్భజన్. సిఎస్‌కె మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించాడు. దీంతో ధోనీకి సిఎస్‌కె జట్టు అంటే ఎంత ప్రేమనో అర్ధంచేసుకోవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసిన వీడియోలో హర్భజన్ ఇలా తెలిపాడు.. “నేను మీతో షేర్ చేసుకొవాలనుకునే ఒక కథ ఉంది. 2018లో, అంటే.. 2 సంవత్సరాల నిషేధం తర్వాత CSK ఈ లీగ్‌కి తిరిగి వచ్చినప్పుడు.. ఒక టీమ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. మగాళ్లు ఏడవరు అనే సామెతను నేను విన్నాను, కానీ ఆ రాత్రి MS ధోని ఏడ్చాడు. అతను ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ విషయం ఎవరికీ తెలియదని నేను అనుకుంటున్నా. అంటూ ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
అప్పుడు ఇమ్రాన్ జవాబిస్తూ.. “నేను కూడా అక్కడే ఉన్నాను. అది అతనికి (ఎంఎస్ ధోని) చాలా ఎమోషనల్ మూమెంట్. అతనిని అలా చూస్తుంటే ఈ జట్టు అతని హృదయానికి ఎంత దగ్గరగా ఉందో నాకు తెలిసింది. అతను జట్టును తన కుటుంబంలా భావిస్తాడు. ఇది చాలా భావోద్వేగానికి గురిచేసింది.” అని దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ తెలిపాడు.