Friday, November 22, 2024

టీమిండియా హెడ్‌కోచ్‌గా ధోనీ?

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ప్రపంచ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ అయినప్పటికీ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పుడు ఆ మహీ భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా రావాలని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా భారత దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ టీమిండియా జట్టు హెడ్‌ కోచ్‌గా ధోనీ వచ్చే అవకాశం ఉందన్నట్లుగా సంకేతాలు ఇచ్చాడు, ఇటీవల స్టార్‌ స్పోర్ట్స్‌తో సునీల్‌ గవాస్కర్‌ మాట్లాడుతూ ”ఎంఎస్‌ ధోనీ త్వరలోనే టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టవచ్చు. అది తప్పక జరగాలని అనుకుంటున్నా” అని పేర్కొన్నారు. జట్టు కోసం ఏదైనా బాధ్యతలు తీసుకునే ముందు కొంత రిలాక్స్‌ కావాలనేది నా ఉద్దేశ్యం అని గవాస్కర్‌ అన్నారు.

అది సెలెక్షన్‌ కమిటీ, మేనేజర్‌, హెడ్‌ కోచ్‌… ఏదైనా కొంత విశ్రాంతి అవసరం అని తెలిపారు. ఎంఎస్‌ ధోనీకి ఆ విశ్రాంతి దొరికింది… ఇంకా ధోనీకి సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా లేదా టీమ్‌ హెడ్‌ కోచ్‌గా కానీ లేదా కోచింగ్‌ స్టాఫ్‌ హెడ్‌గా బీసీసీఐలో కీలకమైన పదవి దక్కుతుందని అని మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ అన్నారు. ఎంఎస్‌ ధోనీకి ఉన్న అనుభవం, విలువైన సూచనలు, సలహాలు, నాయకత్వ పటిమ జట్టుకు చాలా అవసరం అని పేర్కొన్నారు. ధోనీ అనుభవం టీమిండియా ఆధిపత్యాన్ని సుస్థిరం చేస్తుందని గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు. సన్నీ మాటలపై భారత క్రికెట్‌ అభిమానులు, ధోనీ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement