Thursday, November 21, 2024

Brand Ambassador – ఎన్నిక‌ల్లో ఎంఎస్ ధోనీ! ఓటేసేందుకు జ‌నం రెడీ

జార్ఖండ్ ఎన్నిక‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌
ఓట‌ర్ల‌లో అవ‌గాహ‌న పెంచే యత్నాలు
వివ‌రాలు వెల్ల‌డించిన ఎన్నిక‌ల క‌మిష‌న్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, జార్ఖండ్‌:
జార్ఖండ్‌లో త్వరలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నియమితులయ్యారు. ఎన్నికల ప్రచారంలో తన ఫొటోను వినియోగించుకునేందుకు ధోనీ సమ్మతించినట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఈ మేరకు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ కె.రవికుమార్ ఈ విష‌యాన్ని వెల్లడించారు. స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోనీ కృషి చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

రెండు విడ‌త‌ల్లో ఎన్నిక‌లు..
కాగా, 81 స్థానాలున్న జార్ఖండ్‌ అసెంబ్లీకి రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 43స్థానాలకు నవంబర్‌ 13న ఎన్నికలు జరగనుండగా.. మిగిలిని 38 స్థానాలకు నవంబర్‌ 20న ఎన్నికలు ఉంటాయి. నవంబర్‌ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 29,562 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 5తో జార్ఖండ్‌ అసెంబ్లీ గడువు ముగియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement