Tuesday, November 26, 2024

రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి ధన్కడ్.. రాజ్యాంగ సవరణ బిల్లలపై కేంద్రం కసరత్తు

ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్కడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సమావేశాలు కావడంతో రాజ్యసభ చైర్మన్‌గా ఆయన ఎలా వ్యవహరిస్తారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు జులై 18 నుంచి ఆగస్టు 8 వరకు జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభలో 6 కొత్త బిల్లులను ప్రవేశపెట్టగా, అప్పటికే ఉన్న బిల్లులతో పాటు మొత్తం 7 బిల్లులు లోక్‌సభలో పాసయ్యాయి.

రాజ్యసభలో 5 బిల్లులు పాసయ్యాయి. ఒక బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొత్తం 5 బిల్లులు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందాయి. ఈసారి సమావేశాల్లో దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసే బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది భారతీయ జనతా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రెండింట మూడొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాల్సిన కీలకమైన బిల్లులపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement