క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురష్కారం రాజీవ్ ఖేల్ రత్న పేరును మేజర్ ధ్యాన్ చంద్ గా మార్చడంపై ధ్యాన్ చంద్ కుమారుడు అశోక్ కుమార్ స్పందించాడు. ఖేల్‌రత్న అవార్డు పేరు మార్పును తాను స్వాగతిస్తున్నాని తెలిపారు. స్పోర్ట్స్ అవార్డులకు స్పోర్ట్స్ వాళ్ల పేర్లే పెట్టాలనీ ఆయన డిమాండ్ చేశారు. ఇది దానికి ఆరంభం అని అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ధ్యాన్‌చంద్ మొత్తం దేశానికి చెందినవాడు. ఈ అవార్డుకు మొదట రాజీవ్‌గాంధీ పేరు పెట్టారు. కానీ స్పోర్ట్స్ అవార్డులకు స్పోర్ట్స్ వాళ్ల పేర్లు పెడితేనే బాగుంటుందని అశోక్ కుమార్ అన్నారు. మొత్తానికి మన దేశం, ప్రధాని దీనిని గుర్తించారు. హాకీకి పెరిగిపోతున్న ఆదరణ నేపథ్యంలో అత్యున్నత అవార్డుకు ధ్యాన్‌చంద్ పేరు పెట్టడం సంతోషంగా ఉంది అని అశోక్ కుమార్ అన్నారు. ఇక ధ్యాన్ చంద్ కి భారత రత్న పురష్కారం ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
ఇది కూడా చదవండి: పాప్ సింగర్ రిహానా సంపాదన తెలిస్తే షాక్ అవుతారు..