Friday, November 22, 2024

జడ్జీ హత్య కేసు సీబీఐకి అప్పగింత!

దేశవ్యాప్తంగా సంచలం రేపిన ధన్బాద్ లో జడ్డీ హత్య కేసులో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ కేసును సీబీఐకీ అప్పగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం హేమంత్‌ సోరెన్‌ ఘటనపై విచారణ జరుపాలని కేంద్ర విచారణ సంస్థకు సిఫారసు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. కేసు దర్యాప్తు కోసం జార్ఖండ్‌ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు సిట్‌ను ఏర్పాటు చేసింది.

కాగా హత్య కేసు విషయంలో బాధిత కుటుంబం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడంలో జాప్యం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు విచారణకు ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తును తామే పర్యవేక్షిస్తామని, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు అందించాలని సిట్‌ను ఆదేశించింది. అయితే, కేసును సీబీఐకి బదిలీ చేస్తే విచారణలో జాప్యానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, ఈ కేసు విచారణను తనకు తానుగా చేపట్టిన సుప్రీంకోర్టు.. ఝార్ఖండ్ ప్రభుత్వం నుంచి స్టేటస్ రిపోర్టును కోరింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ వారం రోజుల్లోగా ఈ రిపోర్టును పంపాలని చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఇది రోడ్ యాక్సిడెంట్ కాదని స్పష్టంగా తెలుస్తోందని ఈ బెంచ్ వ్యాఖ్యానించింది. హైకోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ లో జోక్యం చేసుకోవడం తమ అభిమతం కాదని, కానీ.. ఈ విధమైన అంశాలను విస్తృత రాజ్యాంగ పరిధిలో పరిశీలించవలసిన అవసరం ఉందని జస్టిస్ రమణ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

- Advertisement -

ధన్‌బాద్‌లో న్యాయమూర్తి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని జార్ఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. జడ్జి మార్నింగ్‌ జాగింగ్‌కు వెళ్లిన సందర్భంలో ఆటోతో ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే.ధన్‌బాద్‌ అదనపు సెషన్స్‌ కోర్టు జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ గత నెల 28న ఉదయం రోడ్డు పక్కన జాగింగ్‌ చేస్తున్న జడ్జిని ఓ ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆయనను ఓ వ్యక్తి గమనించి దవాఖానకు తరలించగా.. మృతి చెందారు.

సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఆటో ఉద్దేశపూర్వకంగానే జడ్జిని ఢీకొట్టినట్లు తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో.. ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో తమప్రేమం ఉందని నిందితులు సైతం ఒప్పుకున్నారని ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అమోల్‌ వినుకాంత్‌ హోంకార్‌ తెలిపారు. ఆటోను దొంగతనం చేశారని పేర్కొన్నారు. పట్టణంలో అనేక మాఫియా హత్యకేసులను న్యాయమూర్తి విచారిస్తున్నారు. ఇటీవల ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల బెయిల్‌ అభ్యర్థనలను తిరస్కరించారు. ఎమ్మెల్యే సంజీవ్‌సింగ్‌ సన్నిహితుడు రంజయ్‌ సింగ్‌ హత్య కేసు సైతం కోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement