Wednesday, September 18, 2024

TG | ట్రాఫిక్ సమస్యలపై డీజీపీ జితేందర్ సమీక్ష

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు, ట్రాఫిక్ అధికారులతో డిజిపి డా.జితేందర్, ఐపీఎస్ సమావేశమై, నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, ఇతర సమస్యలపై చర్చించారు. ఈ సంద‌ర్భంగా నగరంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయ‌న‌ పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ పరిస్థితి, ట్రాఫిక్ రద్దీకి గల కారణాలు, రద్దీని తగ్గించడానికి తీసుకోవలసిన చర్యలను సమీక్షించారు.

రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు, అధికారులు అందరూ రోడ్లపై ఉండాలని ఆదేశించారు. ఏ జంక్షన్‌ వద్దనైనా సిగ్నల్ సైకిల్ ఆప్టిమైజేషన్ మూడు నిమిషాలకు మించి ఉండరాదని తెలిపారు. ట్రాఫిక్ ఇంజినీరింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని వెల్లడించారు. వర్షాకాలంలో జీహెచ్‌ఎంసీతో సమన్వయం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement