Tuesday, November 26, 2024

గోల్కొండలో స్వాతంత్ర్య దినోత్స ఏర్పాట్లను సమీక్షించిన డీజీపీ అంజనీ కుమార్

హైదరాబాద్ : చారిత్రక గోల్కొండ కోటలో ఆగష్టు 15న నిర్వహించనునున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శుక్రవారం డిజిపి అంజనీకుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి ఆగష్టు 15న ఉదయం సికింద్రాబాద్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం, ఉదయం11 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని డీజీపీ తెలిపారు. ఈకార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశానికి నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ స్వాతి లక్రా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, ప్రోటోకాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్, టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్, టిఎస్ఐఐసి ఎండి నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు.

సందర్శకులకోసం ప్రత్యేక ఎల్ఈడిల ఏర్పాటు

- Advertisement -

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే వారు సభాప్రాంగణంలో ఎంత దూరంలో ఉన్నా కార్యక్రమాన్ని స్పష్టంగా వీక్షించేందుకు 14 పెద్ద ఎల్ఈడిలను ఏర్పాటు చేశామని సమాచార పౌర సంబందాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి తెలిపారు. కార్యక్రమ లైవ్ కవరేజ్ కోసం 10 కెమెరా యూనిట్ లను ని, లైవ్ కవరేజ్ లింకింగ్ కు అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు.

సభాప్రాంగణంలో సర్వం సిద్దం

సభకు వచ్చిన ముఖ్య అతిధులు, అధికారులు,సందర్శకులు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు డిజిపికి వివరించారు. హైదరాబాద్ జలమండలి ఆద్వర్యంలో 1 లక్ష వాటర్ ప్యాకెట్ లు, 25 వేల వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేశామని జలమండలి ఎం.డీ దాన కిషోర్ వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు అందించేందుకు సభా ప్రాంగణంలో 4 ఆంబులెన్సులు, గోల్కొండ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒగ గదిని సిద్దంగా ఉంచామని వైధ్యశాఖ అధికారులు తెలిపారు.

3 ఫైర్ ఇంజన్లు 6 బెస్ట్ బైక్స్, 4 ల్యాడర్లు ఏర్పాటు చేయనున్నామని ఫైర్ శాఖ అధికారులు తెలిపారు. విధ్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా ప్రత్యేక జనరేటర్లు, వర్షం పడినా ఇబ్బందులు లేకుండా వ్వాటర్ ప్రూఫ్ షెడ్ లను ఏర్పాటు చేశామని విద్యుత్ శాఖ, రహదారులు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు తెలిపారు. ముఖ్యమంత్రి కి దాదాపు 1200 మంది కళాకారులు స్వగతం పలుకుతారని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ అన్నారు.

1930 వాహనాలకు పార్కింగ్ సదుపాయం

గోల్కొండ కోట పరిసర ప్రాంతాలలో పార్కింగ్ వివరాలను డీజీపీ అడిగి తెలుసుకున్నారు. మొత్తం 1930 వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేశామని ట్రాఫిక్ అదనపు సిపి సుధీర్ బాబు తెలిపారు. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంల్ఏలు, ఎంపిలకు, మీడియా వాహనాలకు సందర్శకులకు వేరు వేరుగా పార్కింగ్ స్థలాలు కేటాయించామన్నారు. జీహెచ్ ఎంసీ అధ్యర్యంలో శానిటేషన్ తదితర ఏర్పాట్లను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హాజరు కావాల్సిఉండగా ఇతర కార్యక్రమాల వాళ్ళ హాజరు కాలేదు. దీనితో, డీజీపీ ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement