Friday, November 22, 2024

విమానాల్లో సమస్యలు అంత పెద్దవికాదన్న డీజీసీఏ..

కొన్ని విమానయాన సంస్థల్లో ఇటీవల తలెత్తిన సాంకేతిక సమస్యలు మొత్తం పరిశ్రమపై ప్రభావం చూసేంత తీవ్రమైనవి కాదని డీజీసీఏ చీఫ్‌ అరుణ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. గత 16 రోజుల్లో మన దేశానికి వచ్చిన విదేశీ విమానాల్లోనూ ఇలాంటి సమస్యలు తలెత్తినట్లు ఆయన చెప్పారు. మన విమానాయ రంగం సురక్షితమేనని చెప్పారు. అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ (ఐసీఏఓ) నియమ నిబంధనలన్నింటినీ పాటిస్తున్నామని ఆయన వివరించారు. విమానాల్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సాధారణంగా జరుగుతుంటాయన్నారు. వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల స్పైస్‌ జెట్‌, ఇండిగో సహా పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పైలట్లు వీటిని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.

ఈ లాంటి సంఘటనలపై వివరణ ఇవ్వాలని ఆయా సంస్థలకు డీజీసీఏ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రెండు నెలల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. అనేక సార్లు సాంకేతిక సమస్యలు తలెత్తిన స్పైస్‌ జెట్‌కు చెందిన సర్వీస్‌లను 50 శాతం మాత్రమే నిర్వహించాలని డీజీసీఏ ఆదేశించింది. వరస సంఘటనలతో ప్రయాణీకుల్లో ఆందోళన వ్యక్తమైంది. కరోనా సంక్షోభంతో దేశీయ విమానయాన రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఇప్పుడే పరిశ్రమ క్రమంగా కొలుకుం టోంది. ప్రస్తుతం రోజుకు ఆరు నుంచి ఏడు వేల వరకు ఎయిర్‌ క్రాఫ్ట్‌ మూవ్‌మెంట్లు నమోదు అవుతున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 మధ్య 150 సందర్భాల్లో పలు విమానాల్లో సమస్యలు తలెత్తినట్లు పౌరవిమానయాన శాఖ తెలిపింది. దీంతో మే నెల 2 నుంచి జులై 13 వరకుడీజీసీఏ ప్రత్యేక తినిఖీలు నిర్వహించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement