విమాన సర్వీస్‌లను తిరిగి పునరుద్ధరించేందుకు గోఫస్ట్ ఎయిర్‌లైన్ సమర్పించిన ప్రణాళికను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదించింది. కోర్టులో ఉన్న కేసులో మధ్యంత ఉత్తర్వులు వచ్చిన తరువాతే ఈ సర్వీస్‌లు ప్రారంభించాలని తెలిపింది. 2004 తరువాత దివాలా పిటిషన్ దాఖలు చేసిన తరువాత ఒక విమానయాన సంస్థ తిరిగి సర్వీస్‌లను పునరుద్ధరించడం ఇదే తొలిసారి.
గోఫస్ట్ విమాన సర్వీస్‌ల పునరుద్ధరణ ప్లాన్‌ను 2023 జూన్ 28న సమర్పించింది. మే నెల 3 నుంచి గో ఫస్ట్ విమాన సర్వీస్‌లను నిలిపివేసి,నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముందు దివాలా పిటిషన్ దాఖలు చేసింది. సంస్థకు ఒప్పందం ప్రకారం విమాన ఇంజిన్లను ప్రాట్ అండ్ విట్నీ సంస్థ సరఫరా చేయకపోవడంతో 54 విమానాలు గ్రౌండ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీని వల్ల ఆర్ధికంగా దివాలా తీసినట్లు తెలిపంది.
- Advertisement -