Friday, November 22, 2024

స్సైస్ జెట్‌కు డీజీసీఏ నోటీసులు.. ఒక్కరోజే మూడు విమానాల్లో సాంకేతికలోపం

ఫ్యూయల్‌ ఇండికేటర్‌లో తలెత్తిన లోపం కారణంగా ఢిల్లి నుంచి దుబాయ్‌ వెళ్లాల్సిన స్సైస్‌జెట్‌ విమానాన్ని పైలెట్‌ దారి మళ్లించి పాకిస్థాన్‌లోని కరాచి విమానాశ్రయంలో ల్యాండ్‌ చేయడంపై ఆ సంస్థకు డీజీసీఏ బుధవారం షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. స్సైస్‌ జెట్‌కు చెందిన మూడు విమానాల్లో మంగళవారం ఒక్కరోజే సాంకేతిక లోపాలు తలెత్తడం, 18 రోజుల్లో ఇటువంటి ఘటనలు 8వ సారి పునరావృతం కావడాన్ని డీజీసీఏ సీరియస్‌గా పరిగణించింది. స్పైస్‌ జెట్‌ సంస్థపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ, డీజీసీఏ ఛైర్మన్‌ మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ సింగ్‌ నోటీసులు జారీ చేశారు.
స్పైస్‌ జెట్‌కు చెందిన ఢిల్లి నుంచి దుబాయ్‌ వెళ్తున్న విమానంలో తలెత్తిన ఫ్యూయల్‌ ఇండికేటర్‌ సమస్య కారణంగా ఒక విమానం కరాచీలో ల్యాండ్‌ కాగా, గుజరాత్‌ లోని కాండ్లా నుంచి ముంబై వెళ్తున్న మరో విమానానికి 23 వేల అడుగుల ఎత్తులో విండ్‌షీల్డ్‌కు పగులు ఏర్పడింది. దీంతో, పైలెట్లు ముంబై విమానాశ్రయంలో ప్రాధాన్య ప్రాతిపదికన ల్యాండింగ్‌ నిర్వహించారు. కోల్‌కతా నుంచి చాంగ్‌ కింగ్‌ బయల్దేరిన మరో స్పైస్‌జెట్‌ విమానం బయలుదేరిన కాసేపటికే వెదర్‌ రాడార్‌ పని చేయడం లేదని పైలెట్‌ గుర్తించి విమానాన్ని తిరిగి కోల్‌కతా మళ్లించారు.

కొద్ది వారాలుగా స్పైస్‌జెట్‌కు చెందిన విమానాల్లో, సాంకేతికలోపాలు ఏర్పడుతుండడంపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) స్పైస్‌ జెట్‌కు షోకాజ్‌నోటీస్‌ జారీ చేసింది. పద్ధెనిమిది రోజుల్లో ఎనిమిది విమానాలు సాంకేతిక లోపాలు ఏర్పడటానికి గల కారణాలపై ప్రశ్నించింది. తరచుగా సైస్‌ జెట్‌ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్న కారణంగా విమానాలకు అంతర్గత భద్రత లేదని, భద్రతా లోపాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అందువల్లనే స్పైస్‌ జెట్‌ విమానాల భద్రత ప్రశ్నార్థకంగా మారాయని పేర్కొంది. ఈ నోటీసులకు మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని డీజీసీఏ పేర్కొంది. భద్రతా కారణాలతో పాటు, చిన్న చిన్న పరికరాలను సప్లయ్‌ చేస్తున్న వారికి డబ్బులు చెల్లించడం లేదని, విమానాల సర్వీస్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని డీజేపీఏ ఆ నోటీస్‌లో పేర్కొంది. స్పేర్‌ పార్ట్స్‌ కారణంగానే విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నట్లు గుర్తించడం జరిగిందని ఆ నోటీస్‌ లో పేర్కొంది. మూడు వారాల్లోగా నోటీస్‌కు సమాధానం చెప్పాలని సీఎండీ అజయ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

ప్రయాణీకుల భద్రతే ఫస్ట్‌ – కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య

స్పైస్‌ జెట్‌ విమానాల్లో తరచుగా తలెత్తుతున్న సాంకేతిక లోపాలు, డీజీసీఏషోకాజ్‌ నోటీస్‌ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రయాణీకుల భద్రతపై ట్వీట్‌ చేశారు. ప్రయాణీకుల భద్రత అత్యంత ప్రధానమని మంత్రి జ్యోతిరాదిత్య ప్రకటించారు. ప్రయాణీకుల భద్రతలో చిన్న తప్పు దొర్లినా, చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

18 రోజుల్లో 8 సార్లు..

- Advertisement -

మే 4 – చెన్నై – దుర్గాపూర్‌ విమానం గాల్లో ఉండగా, ఆయిల్‌ ఫిల్టరింగ్‌ సమస్య ఏర్పడింది. దీంతో పైలెట్లు ఒక ఇంజన్‌ ఆపి అత్యవసర ల్యాండింగ్‌ చేశారు.
మే 28 . 23వేల అడుగుల ఎత్తులో ముంబై – గోరఖ్‌పూర్‌ విమానంలో విండ్‌షీల్డ్‌లో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో, విమానాన్ని తిరిగి బయలుదేరిన స్థానానికే పైలెట్లు మళ్లించారు.
జూన్‌ 19 ఎత్తుకు వెళుతున్న కొద్దీ క్యాబిన్‌లో మెయింటైన్‌ కావల్సిన ఒత్తిడి లేకపోవడంతో జబల్పూర్‌ నుంచి బయలుదేరిన విమానం ఢిల్లిdలో అత్యవసరంగా దిగింది.
జులై 2 : క్యాబిన్‌లో పొగ రావడంతో జబల్‌పూర్‌ నుంచి వెళ్లిన విమానం ఢిల్లిdలో ల్యాండయింది.
జులై 5: ఢిల్లిd నుంచి దుబాయ్‌ వెళ్తున్న విమానం ఫ్యూయల్‌ ఇండికేటర్‌ పని చేయక పోవడంతో కరాచీకి దారి మళ్లించి ల్యాండ్‌ చేశారు.
జులై 5 : గుజరాత్‌ లోని కాండ్లా నుంచి ముంబై వెళ్తున్న మరో విమానం 23 వేల అడుగుల ఎత్తులో విండ్‌షీల్డ్‌ కు పగులు ఏర్పడింది. దీంతో, పైలెట్లు ముంబై విమానాశ్రయంలో ప్రాధాన్య ప్రాతిపదికన ల్యాండింగ్‌ నిర్వహించారు.
జులై 5 కోల్‌కతా నుంచి చాంగ్‌ కింగ్‌ బయల్దేరిన కాసేపటికే వెదర్‌ రాడార్‌ పని చేయడం లేదని పైలెట్‌ గుర్తించి విమానాన్ని తిరిగి కోల్‌కతా మళ్లించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement