Friday, November 22, 2024

నొవొవ్యాక్స్ కు డీజీసీఏ అత్యవసర అనుమతి.. 12-18 ఏళ్ల వారికి వినియోగం

దేశంలో 12-18 ఏళ్ల వయస్సు వారికి అత్యవసర వినియోగానికి ఉపయోగించేందుకు తమ కొవిడ్‌ వ్యాక్సిన్‌కు డీజీసీఏ అనుమతులు లభించినట్టు నొవొవ్యాక్స్‌ తెలిపింది. నొవొవ్యాక్స్‌ను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేస్తోంది. దీన్ని కొవొవ్యాక్స్‌ పేరిట మార్కెటింగ్‌ చేస్తున్నది. 12-18 ఏళ్ల గ్రూపునకు చెందిన 460 మందిపై మధ్య చివరి దశ అధ్యయనంలో తమ టీకా రోగ నిరోధక శక్తి ఉత్పత్తి చేసిందని కంపెనీ తెలిపింది. గత నెలలో 12-17 ఏళ్ల వయస్సుగల 2,247 మందిపై నొవొవ్యాక్స్‌ తన కొవిడ్‌ వ్యాక్సిన్‌ను పరీక్షించింది. చివరి దశ ట్రయల్స్‌లో ఇది కొవిడ్‌కు వ్యతిరేకంగా 80శాతం ప్రభావవంతంగా పని చేసినట్టు తెలిపింది. ఈ వయస్సు గ్రూప్‌ వారికి అత్యవసర వినియోగానికి పొందిన నాల్గో వ్యాక్సిన్‌గా నొవొవ్యాక్స్‌ నిలిచింది. అంతకుముందు బయోలాజికల్‌ ఈ కంపెనీకి చెందిన కొర్బా వ్యాక్స్‌, జైడస్‌ క్యాడిలాకు చెందిన జైకోవ్‌ డీ, భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌లు ఈ అనుమతులు పొందాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement