Sunday, November 3, 2024

Devotional – శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, నంద్యాల బ్యూరో : నంద్యాల జిల్లా ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల మహా క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. కార్తీక మాసం తొలి ఆదివారం కావ‌డంతో ఏపీ, తెలంగాణ తోపాటు ప‌క్క‌నున్న ఒడిశా, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క నుంచి కూడా అధిక సంఖ్య‌లో భ‌క్తులు వ‌చ్చారు. దీంతో శ్రీ‌శైలంలో ఇసుక పోస్తే రాల‌నంతా భ‌క్త‌జ‌నం ఉన్నారు.

ఆన్‌లైన్‌, అలాగే ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర్శ‌నం టికెట్లు పొంది క్యూలైన్‌లో బారులు తీరారు. భ్రమరాంబికా, మల్లికార్జున స్వామికి…ద్వాద‌శ జ్యోతిర్లింగం, శ‌క్తిపీఠం గ‌ల మాహా పుణ్య‌క్షేత్రంలో శ్రీ‌శైలంలోని భ్ర‌మ‌రాంబికా, మ‌ల్లికార్జున స్వామికి భ‌క్తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా క్యూలైన్‌లో భ‌క్తులు బారులు తీరారు.

అలాగే మల్లికార్జున మండ‌పంలో అభిషేకాలు నిర్వ‌హించార‌. భ్ర‌మ‌రాంబికా ఆల‌యంలో కుంకుమ పూజ‌లు చేశారు. కార్తీక‌మాసంలో ప్ర‌త్యేక ఏర్పాట్లుకార్తీక మాసంలో భ‌క్తులు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా ఈఓ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.

ఆలయ ద్వారాల ను కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. భక్తులకు వసతి, తాగు నీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, పారిశుద్ధ్యం కార్యక్రమాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారు.శ్రీ‌శైలంలో స్ప‌ర్శ‌ద‌ర్శ‌నం నిలుపుద‌ల‌కార్తీక మాసం సంద‌ర్భంగా లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీకపౌర్ణమి రోజున జ్వాలాతోరణోత్సవం, నదీహారతి వంటి ప్రత్యేక కార్య‌క్ర‌మాలు ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

కార్తీక మాసోత్సవ రద్దీ రోజుల్లో శ్రీస్వామి, అమ్మవార్ల స్పర్శదర్శనం ను నిలుపు చేస్తున్నట్లు ఇన్చార్జి శేఖర్ రెడ్డి తెలిపారు. కార్తీక మాసంలో వచ్చే భక్తుల కోసం రద్దీకి అనుగుణంగా వచ్చే భక్తుల కోసం లడ్డూ ప్ర‌సాదం ప్రత్యేక కేంద్రాల ద్వారా విక్ర‌యిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు జరిగే ప్రత్యేక కార్యక్రమాలను వివరించారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు

.శివ చతుసప్తహ భజనలుద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకొని కార్తీక మాస శివ చతుసప్తాహ భజనలను ఈవో చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. లోక కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం శ్రావణ, కార్తీక మాసంలో శివ చతుసప్తాహ భజనలను నిర్వహిస్తోంది. పవిత్ర అఖండ భజనలను కార్తీక మాసాంతం నిర్వహించనున్నారు..

.ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం అర్చక స్వాములు సంకల్పాన్ని పఠించి భజనలు నిర్విఘ్నంగా జరిగేందుకు గణపతి పూజ జరిపించారు. అనంతరం చండీశ్వర స్వామికి విశేష పూజలు జరిపించి శివ ప్రణవ పంచాక్షరి నామ భజనలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలుకు చెందిన రెండు భజన బృందాలు, కర్ణాటకకు చెందిన నాలుగు భజన బృందాలకు అవకాశం కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement