బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి 27చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు బల్కంపేట ఎల్లమ్మను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణానికి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు.
- Advertisement -