Saturday, November 23, 2024

తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల సంఖ్య..

కరోనా ఎఫెక్ట్ వెంకన్న సన్నిధికి వచ్చే భక్తులపై భారీగా పడింది. నిన్న తిరుమలలో భక్తుల సంఖ్య సాధారణ స్థాయితో పోలిస్తే గణనీయంగా తగ్గింది. భక్తుల సంఖ్య కనిష్ఠ స్థాయిలో ఉన్నందున కొత్త కరోనా నిబంధనలను విధించడం లేదని, ఇప్పుడున్న నిబంధనలనే అమలుచేస్తున్నామని అధికారులు తెలిపారు. కేవలం ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాన్ని కల్పిస్తున్నామన్నారు. క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ ను తప్పనిసరి చేశామని అయినప్పటికి భక్తుల సంఖ్య భారీగా తగ్గుతోందని తెలిపారు. గత సంవత్సరం లాక్ డౌన్ తరువాత ఆలయంలోకి తిరిగి భక్తులను అనుమతించిన వేళ, భక్తుల సంఖ్య 50 వేల వరకూ పెరుగగా, ఇప్పుడు కేసులు పెరుగుతున్న వేళ మళ్లీ భక్తుల సంఖ్య పడిపోయింది. నిన్న మంగళవారం కేవలం 11,490 మంది భక్తులు మాత్రమే స్వామిని దర్శించుకున్నారు. 5,024 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా స్వామివారికి రూ. 1.30 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement