Tuesday, November 26, 2024

ఈదురుగాలులు, భారీ వ‌ర్షాలు.. మైహార్ దేవాలయం రోప్‌వే మ‌ధ్య‌లోనే భక్తులు

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో బలమైన గాలులు, భారీ వర్షాలతో భ‌క్తులు ప్రయాణిస్తున్న రోప్‌వే ట్రాలీలు ఆగిపోయాయి. దీంతో మైహార్ కొండపై ఉన్న మా శారదా దేవి ఆలయాన్ని సందర్శిస్తున్న సుమారు 28 మంది భక్తులు గాలిలో చిక్కుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఏడు ట్రాలీలు, ఒక్కో దాంట్లో నలుగురు వ్యక్తులున్నారు. వీళ్లంతా దాదాపు 40 నిమిషాల పాటు గాలిలో ఊగుతూనే ఉన్నారు.

ఈ ప్రాంతంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున రోప్‌వే కార్యకలాపాలను మూసివేయాలని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ.. రోప్‌వే నిర్వహణ సేవలను ఆపలేద‌ని తెలుస్తోంది. అయితే.. ఆ త‌ర్వాత ట్రాలీలను కిందకు దించడంతో పెద్దగా ప్రమాదం జరగకుండా భక్తులందరినీ రక్షించారు. గత నెలలో జార్ఖండ్‌లోని డియోఘర్‌లో జరిగిన భారీ రోప్‌వే ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చ‌నిపోయారు. మరియు పలువురు గాయపడ్డ విష‌యం తెలిసిందే..

Advertisement

తాజా వార్తలు

Advertisement