Monday, November 25, 2024

National : బాలరాముడికి…బంగారు రామాయణం…

అయోధ్య రామయ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. కొంద‌రు భ‌క్తులు రామయ్యకు ప్రత్యేక కానుకలు సమర్పిస్తూ తమ భక్తి చాటుకుంటున్నారు. ఇదేకోవ‌లో తాజాగా ఓ రామభక్తుడు చరిత్రలో నిలిచిపోయే కానుకను ఆ అయోధ్య బాలక్ రామ్‌కు సమర్పించాడు. రూ.5 కోట్లు విలువ చేసే ఏడు కిలోల ‘బంగారు రాణాయణాన్ని’ రాంలల్లాకు కానుకగా ఇచ్చాడు. ఈ స్వర్ణ రామాయణం మహాకావ్య రచనను 500 బంగారు పేజీల్లో లిఖించారు.

అయోధ్య ప్రాణప్రతిష్ట సమయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ్ తన జీవిత సంపాదన మొత్తాన్ని ఆ రాంలాల్లాకు అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు ఆయన రూ.5 కోట్లు ఖర్చు చేసి 151 కిలోల బరువున్న రామ్‌చరిత్ మానస్‌ (రామాయణం)ను సిద్ధం చేయించారు. 10,902 శ్లోకాలతో కూడిన ఈ బంగారు రామాయణానికి సంబంధించిన ప్రతి పేజీపై 24 క్యారెట్ల బంగారు పూత ఉంది. ఈ స్వర్ణ రామాయణంలో 480-500 వరకు పేజీలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement