కొబ్బరికాయ ధర ఎంత ఉంటుంది మహా అయితే..20,30 రూపాయలు ఉంటుంది. అయితే ఓ కొబ్బరికాయ వేలంలో ఏకంగా రూ.66వేలు ధర పలికిందట. తమిళనాడులోని తేని జిల్లా బోడి ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయంలో స్కందషష్టి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వళ్లి, దేవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవాన్ని సోమవారం రాత్రి నిర్వహించారు. పూజల్లో ఉంచిన వస్తువులను వేలం వేశారు. కాగా కొబ్బరికాయను రూ.66వేలకు ఓ భక్తుడు సొంతం చేసుకున్నారు. గతేడాది రూ.27 వేలు పలికింది. ఇంట్లో ఈ కొబ్బరికాయను ఉంచి పూజలు నిర్వహిస్తే ఐశ్వర్యం పెరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఎంత ధర అయినా పర్వాలేదని ఈ కొబ్బరికాయని ఇంత ధరకు కొన్నాడట.
Advertisement
తాజా వార్తలు
Advertisement