హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు వల్ల తెలంగాణ గ్రామాలు సంపూర్ణ అభివృద్ధిని సాధిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు సాధిస్తున్నాయన్నారు. స్వచ్ఛ గ్రామీణ అవార్డులు తెలంగాణకు వచ్చినంతగా గుజరాత్ రాష్ట్రానికి ఎందుకు రావడం లేదని మంత్రి ఎర్రబెల్లి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. ఇటీవల జాతీయ అవార్డులు పొందిన తెలంగాణ గ్రామాలు, మండలాలు, జిల్లా పరిషత్ ల ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ నెల 17న ఢిల్లీ లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా వారికి, హైదారాబాద్ లోని మంత్రుల నివాసంలో అల్పాహార విందు ఇచ్చి వీడ్కోలు పలికారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం ప్రత్యేక చొరవతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు గత మూడేళ్లలో రాష్ట్రానికి 79 అవార్డులు వచ్చాయన్నారు. కేంద్రం సహకరిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేదన్నారు ఇప్పటికైనా సీఎం కేసీఆర్ చెప్పినట్లు, అసెంబ్లీ తీర్మానం చేసిన విధంగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుందని కేంద్రానికి సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement