కేరళలో ఈసారి కమల వికాసం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ… కేరళలో ఇప్పటి వరకూ పాలించిన ఎల్డీఎఫ్, యుడిఎఫ్ లు కేరళ అభివృద్దికి ఏమాత్రం కృషి చేయలేదంటూ ఆరోపించారు.. కేరళలోని సౌత్ కేరళ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఆయన పాలక్కడ్ లో నేడు రోడ్ షో నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా ప్రధాని మాట్లాడుతూ.. కేరళ రాష్ట్ర ప్రజలు ఇన్నాళ్లు కష్టాలను చవిచూశారని అంటూనే.. అవినీతి, అసమర్థతలో రాష్ట్ర ప్రభుత్వం మునిగిపోయిందని మండిపడ్డారు.
ప్రస్తుతం కేరళలో పోటీపడే ఎల్‌డీఎఫ్, యూడిఎఫ్ లు ఢిల్లీలో ఒక్కటయ్యాయని ధ్వజమెత్తారు. ఈ పార్టీలు కేరళ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు పచ్చి అబద్ధాలు మాత్రమే చెప్తారని ఆరోపణలు చేశారు. కేరళ ప్రజలు విజ్ఞానవంతులని, ఈ సార్వత్రిక ఎన్నికలలో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.