భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. జగిత్యాలలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఉద్వేగంగా ప్రసంగించారు. జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు.
- Advertisement -
శక్తిపై (అధికారంపై) తమ పోరాటం అని రాహుల్ అన్నారని.. శక్తిని నాశనం చేయాలంటూ విపక్ష కూటమి యత్నిస్తోందని మోదీ విమర్శించారు. ఆంగ్లేయులు, రజాకార్లపై తెలంగాణ తిరుగుబాటు చేసిందన్నారు. ప్రజల భావోద్వేగాలను బీఆర్ ఎస్ వాడుకుందని మండిపడ్డారు. తెలంగాణలోని పలు ప్రాజెక్టులు బీఆర్ ఎస్ పార్టీకీ ఏటీఎంలుగా మారాయన్నారు. ఇక.. తెలంగాణ కలలను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందన్నారు.