దేశ రాజధాని ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇవ్వాల ఓ పరిణామం జరిగింది. బీజేపీ లీడర్లకు ప్రచారంగా మారిన ఈ లిక్కర్ కేసులో ఇప్పటిదాకా విచారణల వరకే దర్యాప్తు కొనసాగగా… మంగళవారం తొలి అరెస్ట్ నమోదైంది. ఈ వ్యవహారంపై తొలుత కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు ‘ఓన్లీ మచ్ లౌడర్’ సంస్థ సీఈఓగా పనిచేస్తున్న విజయ్ నాయర్‌ను అరెస్ట్ చేశారు. ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో సేవలు అందిస్తున్న ఓన్లీ మచ్ లౌడర్ కంపెనీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఈ సంస్థ సీఈఓ విజయ్ నాయర్‌ను ఐదో నిందితుడిగా సీబీఐ అధికారులు తమ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ నాయర్‌కు చెందిన కీలక ఆధారాలు లభించడంతో ముంబైలో ఉన్న ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. అదుపులోకి తీసుకున్న నాయర్‌ను సీబీఐ ఢిల్లీకి తరలించింది.