వైఎస్ షర్మిల తన పార్టీని అధికారికంగా ప్రారంభించకముందే షాకులు తగులుతున్నాయి. నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు షర్మిల పార్టీలో గుర్తింపు దక్కడం లేదని ఆరోపిస్తూ పలువురు ఆమె పార్టీకి రాజీనామాలు ప్రకటిస్తున్నారు. ఈరోజు దేవరకద్ర కేటీ నరసింహారెడ్డి షర్మిల పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు లోటస్ పాండ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. ఆయన దారిలోనే మరికొందరు అడ్ హక్ కమిటీకి రాజీనామాలు చేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా షర్మిల వెంట ఉన్న సతీష్ బీజేపీకి, ఇందిరా శోభన్ కాంగ్రెస్ పార్టీకి కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అసలైన వైఎస్ఆర్ అభిమానులకు పార్టీలో గుర్తింపు దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.