నేడు మదర్స్ డే సందర్భంగా మెగా కోడలు ఉపాసన కొణిదెల బేబీ బంప్ తో ఉన్న లేటెస్ట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 8వ నెల గర్భంతో ఉన్న ఉపాసన .. పిక్చర్‌లో చిరునవ్వుతో తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తోంది. అంతేకాదు తాను అమ్మ అవుతున్న సందర్భాన్ని ఎంజాయ్ చేస్తున్నానని.. మాతృత్వాన్ని స్వీకరించడానికి ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు ఉపాసన. అంతేకాదు తాను మాతృత్వాన్ని వారసత్వం కొనసాగించడానికో.. లేదా మా వివాహ బంధం బలోపేతం కావాలనో కోరికతోనే స్వీకరించలేదన్నారు. తాను పెళ్లి అయిన తర్వాత.. ఎప్పుడైతే.. పరిపూర్ణంగా తన బిడ్డ మంచి చెడులను చేసుకోగలను అనే ఫీల్సింగ్ తో పాటు.. తన పుట్టబోయే పిల్లలకు ఎటువంటి కండిషన్స్ లేకుండా ప్రేమని, సంరక్షణని అందించగలనో అప్పుడే తల్లి కావాలని.. అందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే పిల్లలను కనాలని నిర్ణయించుకున్నానని గుర్తు చేసుకుంది ఉపాసన.
Advertisement
తాజా వార్తలు
Advertisement