Friday, November 22, 2024

కొత్త బ్లడ్‌ టెస్టుతో కేన్సర్‌ల గుర్తింపు.. లక్షణాలు లేకున్నా గుర్తించే అవకాశం

మడికల్‌ సైన్స్‌లో అద్భుతం ఆవిష్కృతమైంది. కేన్సర్‌ను గుర్తించడంలో వైద్యరంగం గొప్ప ముందడుగు వేసింది. ఒక్క రక్త పరీక్షతో రకరకాల కేన్సర్లను గుర్తించే కొత్త రక్త పరీక్షను అందుబాటులోకి తీసుకు వచ్చింది. కేన్సర్‌ లక్షణాలకు సంబంధించిన ఒకే ఒక్క లక్షణం రోగుల్లో లేకపోయినా, మల్టి కేన్సర్‌ ఎర్లీ డిటెక్షన్‌ (ఎంసీఈడీ) తో గుర్తించవచ్చని ప్రకటించింది. ఇది కేన్సర్‌ స్క్రీనింగ్‌లో మొదటి అడుగని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ పరీక్షను యాభై ఏళ్లు దాటిన వారికి నిర్వహిస్తారు.

కొెత్త బ్లడ్‌ టెస్టుతో సేషెంట్లలో రకరకాల కేన్సర్‌లను సక్సెస్‌ఫుల్‌గా గుర్తించడం జరిగింది. 6,662 మందిపై ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. పరీక్షలు నిర్వహించిన వారిలో ఒక్క శాతం మంది కేన్సర్‌ నిర్థారించడం జరిగింది. కేన్సర్‌ సిగ్నల్‌ ను 02 మంది పేషెంట్లలో గుర్తించడం జరిగింది. ఫలితాలను పారిస్‌ లోని యూరోపియన్‌ సొసైటీ ఫర్‌ మెడికల్‌ ఆంకాలజీ (ఈఎస్‌ఎంఓ)కాంగ్రెస్‌ 22లో వెల్లడించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement