Tuesday, December 10, 2024

U19 Asia Cup | వైభ‌వ్ విధ్వంసం.. ఫైనల్స్‌కు భారత్ !

అండర్ 19 ఆసియా కప్ 2024 టోర్నమెంట్ యువ భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్‌లో శ్రీలంకతో త‌ల‌ప‌డిన యంగ్‌ ఇండియా… 7 వికెట్ల తేడాతో ఘ‌న‌ విజయం సాధించి ఫైనల్స్‌లోకు దూసుకెళ్లింది.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను 173 పరుగులకే కుప్పకూల్చిన భారత జట్టు… అనంత‌రం స్వ‌ల్ప చేధ‌న‌లో చ‌ల‌రేగింది. దీంతో భారత జట్టు 21.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేసి.. మరో 170 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (36 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 67) విధ్వంసకర బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. ఇక‌ ఆయుష్ మాత్రే (34), ఆండ్రీ సిద్ధార్థ్ (22), కెప్టెన్ మహ్మద్ అమన్ (25) ప‌రువాలేద‌నిపించారు. శ్రీలంక బౌలర్లలో విహాస్, విరన్, ప్రవీణ్ తలో వికెట్ తీసారు.

- Advertisement -

అంత‌క‌ముందు ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక భార‌త బౌల‌ర్ల ధాటికి 46.2 ఓవర్లలో 173 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్ల‌లో లక్విన్ అబేసింఘే (69) అర్ధ సెంచరీతో రాణించాడు. షారుజన్ షణ్ముగనాథన్ (42) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారు అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయారు. ఇక భార‌త బౌల‌ర్ల‌లో చేతన్ శర్మ(3/34) మూడు వికెట్లు తీయగా.. కిరణ్ చోర్మలే, ఆయుష్ మ్హత్రే రెండేసి వికెట్లు పడగొట్టారు. యుధాజిత్ గుహ, హార్దిక్ రాజ్ చెరో వికెట్ ద‌క్కించుకున్నారు.

ఇక‌ డిసెంబర్ 10న దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌ జట్టుతో భారత్ తలపడనుంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement